36.2 C
Hyderabad
Wednesday, April 22, 2026

Live Video

spot_img

మా మధ్య విభేధాలు అవాస్తవం – టీటీడీ ఈవో

సామాజిక మాధ్యమాల్లో తిరుమల గురించి తప్పుడు ప్రచారం జరుగుతోందని టీటీడీ ఈఓ శ్యామలరావు అన్నారు. సోమవారం ఉదయం టీటీడీ చైర్మన్‌ బీఆర్‌నాయుడు, జేఈవో వెంకయ్య చౌదరిలతో కలసి ఈవో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ చైర్మన్‌ బీఆర్‌నాయుడిని తాను విభేదిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో అస్సలు నిజం లేదని స్పష్టం చేశారు. చైర్మన్‌తో పాటు పాలమండలి సభ్యులు, అదనపు ఈవోతో నాకు విభేధాలు ఉన్నట్లు మీడియా, సోషల్‌ మీడియాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవని ఈఓ శ్యామలరావు చెప్పారు. జనవరి 8వ తేదీన జరిగిన తొక్కిసలాటకు చైర్మన్‌, ఈవో, జేఈవోల మధ్య సమన్వయం లేకపోవడమే కారణమని వస్తున్న వార్తల్లో కూడా నిజం లేదన్నారు. వైకుంఠద్వార దర్శనాలకు అనని ఏర్పాట్లు సక్రమంగానే చేశామని కానీ తిరుపతిలో జరిగిన ఘటన ప్రొటోకాల్‌ ప్రకారమే జరిగిందన్నారు. టోకెన్లు తీసుకోవడానికి భక్తులను వదిలినప్పుడు అనుకోకుండా తొక్కిసలాట జరిగిందని చెప్పారు. దీనిపై విచారణ జరుగుతోందని బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు ఈవో. అందరి సమన్వయంతో ముందుకు వెళుతున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు పేర్కొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com