26.5 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

వరి ఉత్పత్తిలో తెలంగాణ రికార్డు

దేశంలో వరి ఉత్పత్తిలో ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ సంవత్సరం దాదాపు 280 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి జరిగిందని, ఇది ఒక రికార్డని తెలిపారు. ఈ ఘనతకు రైతుల కృషి, అనుకూలమైన వాతావరణ పరిస్థితులు, ప్రకృతి సహకారం, కొత్త వరి రకాలు అందుబాటులో ఉండటం కారణమని చెప్పారు. రైతాంగానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, సన్న రకాలకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌తో పాటు ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజల స్థానిక అవసరాలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్న బియ్యం పంపిణీ కోసం ఉద్దేశించిన బియ్యం, కేంద్ర నిల్వల కోసం 60 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయించిన తర్వాత కూడా, రాష్ట్రంలో ఇంకా 50 నుంచి 60 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మిగులు ఉంటుందని మంత్రి వెల్లడించారు.

ఈ మిగులు ధాన్యాన్ని మార్కెట్ చేయడానికి అన్వేషణలో భాగంగా, ఆగ్నేయ ఆసియాలోని ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యాన్ని ఎగుమతి చేయడానికి ఆ దేశ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఒప్పందంలో భాగంగా ఏడాదికి 10 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యాన్ని ఎగుమతి చేసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. దొడ్డు రకాలలో ముఖ్యమైన ఎంటియు-1010 మరియు ఐఆర్-64 రకాలను రాష్ట్రంలో విస్తృతంగా సాగు చేస్తున్నారని, వీటికి ఫిలిప్పీన్స్‌లో అధిక డిమాండ్ ఉందని ఆయన తెలిపారు. వరి సాగులో నేరుగా విత్తే పద్ధతి, రోజు విడిచి రోజు నీరు పెట్టే విధానం, తక్కువ రసాయనాలు కలిగిన వరి రకాలను ఉత్పత్తి చేయడంపై రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలకు మంత్రి సూచించారు.

ఆధునిక బియ్యం మిల్లులను ఒక డెమో రూపంలో వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసి రైతులకు, యువతకు శిక్షణ ఇచ్చి ఆధునిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని ఆయన కోరారు.

ఉపకులపతి ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య మాట్లాడుతూ.. ఫిలిప్పీన్స్ దేశం ఎప్పటికీ దిగుమతి చేసుకునే దేశమేనని, ఆ దేశాన్ని తెలంగాణ బియ్యానికి అనుకూలమైన మార్కెట్‌గా గుర్తించి చర్యలు తీసుకుంటే తెలంగాణలో పండుతున్న బియ్యం నిల్వలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. ప్రభుత్వం వరి ధాన్యం సేకరణ కేంద్రాల నుంచి బియ్యం ఔత్సాహిక ఎగుమతిదారులకు సరఫరా చేస్తే ప్రభుత్వానికి అయ్యే ఖర్చుకు సమానంగా ఔత్సాహికదారులకు ఇచ్చినట్లయితే ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండానే ఎగుమతులను ప్రోత్సహించే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com