28.3 C
Hyderabad
Sunday, November 1, 2026

Live Video

spot_img

అట్టలతో అద్భుతంగా తెలంగాణ సచివాలయం

  • పదో తరగతి విద్యార్థి అపురూప ఆలోచన

  • అబ్బుర పరుస్తున్న అక్షయ్‌ గౌడ్ రూపకల్పన

పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి అట్టలతో తెలంగాణ సచివాలయం రూపొందించాడు. అచ్చు గుద్దినట్లు అట్ట పెట్టెలతో అత్యద్భుతంగా తీర్చిదిద్దాడు. ప్రత్యేకమైన నిర్మాణ శైలితో కొత్త సచివాలయం తెలంగాణ రాష్ట్రానికి ఓ ఐకన్‌ మాదిరిగా రూపుదిద్దుకుంది. అలాంటి క్లిష్టమైన సచివాలయం నిర్మాణానికి అట్టలతో నమూనా తయారు చేశాడు బాలగోని అక్షయ్‌ గౌడ్‌ అనే విద్యార్థి.

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌ మండలం పోచారం గ్రామానికి చెందిన బాలగోని అక్షయ్‌ గౌడ్‌.. నారపల్లిలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. వినూత్నంగా ఆలోచిస్తూ.. రోజూ కొంత సమయం కేటాయించి తెలంగాణ సచివాలయం నమూనాను తయారు చేశాడు. ఖాళీగా ఉన్న సమయాలలో సజనాత్మకంగా ఆలోచించే అక్షయ్ గౌడ్‌.. ఇప్పటికే అట్టలతో తాము నివసిస్తున్న ఇంటి నమూనా, ట్రాక్టర్‌, ట్రక్‌, జీపులను తయారు చేశాడు. అవి తయారు చేయడంలో నేర్పు రావడంతో.. ఇప్పుడు తెలంగాన సచివాలయం నమూనాను అట్టలతో రూపొందించాడు.

అంతేకాదు.. అట్టలతో తెలంగాణ సచివాలయం నిర్మించడంతో పాటు.. రిమోట్‌ సిస్టంతో లైటింగ్‌ అమర్చాడు. ఈ నమూనా, రిమోట్‌ లైటింగ్‌ సిస్టం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. అందరి ప్రశంసలు అందుకుంటోంది. అక్షయ్‌గౌడ్‌ ప్రతిభను స్థానికులు ఎంతగానో కొనియాడుతున్నారు. అటు చదువులోనూ చురుగ్గా ఉండే అక్షయ్‌గౌడ్‌, ప్రతీ పరీక్షలోనూ క్లాస్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధిస్తున్నాడు. క్రీడా పోటీల్లోనూ పలు బహుమతులు సాధించాడు. చదువుతో పాటు.. క్రియేటివిటీగా ఆలోచించేందుకు తనకు సహకరిస్తున్న తల్లిదండ్రులు బాలగోని నర్సింహగౌడ్‌-లక్ష్మి తనకు రోల్‌ మోడల్‌ అని అక్షయ్‌ చెబుతున్నాడు. అలాగే, తమ స్కూల్‌ చైర్మన్‌ సామల సందీప్‌రెడ్డి అన్ని రకాలుగా తనకు ప్రోత్సాహం అందిస్తున్నారని అంటున్నాడు. తనకు మరింత ప్రోత్సాహం అందిస్తే.. మరిన్ని సృజనాత్మక ప్రయోగాలు చేయగలుగుతానని ధీమాగా చెబుతున్నాడు. అక్షయ్‌గౌడ్‌ ప్రతిభకు, సృజనాత్మకతకు, వినూత్న ఆలోచనకు మనం కూడా హ్యాట్సాఫ్‌ చెబుదామా…

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com