గ్రేటర్ హైదరాబాద్ లో ఈ రోజు రాత్రి నూతన సంవత్సర వేడుకలు చేసుకునే వారికి ఉచిత రవాణా సదుపాయం అందుబాటులో ఉంటుంది. డిసెంబర్ 31 న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఉచిత రవాణా సదుపాయం అందించనున్నట్టు తెలంగాణ ఫోర్ వీలర్స్ డ్రైవర్ అసోసియేషన్ ప్రకటించింది. మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాలకు గురవుతారని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపిన ఫోర్ వీలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని ఫోర్ వీలర్ అసోసియేషన్ గిగ్ వర్కర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి
హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ పరిధిలో 500 కార్లు 250 బైక్ టాక్సీలు డ్రైవర్లు అందుబాటులో ఉంటారని సేఫ్ జర్నీ కోసం ఉచిత రవాణా సదుపాయం అందుబాటులో ఉంటుందన్నారు. ఈ రోజు(డిసెంబర్ 31) రాత్రి పది గంటల నుంచి రాత్రి 1 గంటల వరకు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
గత 8 సంవత్సరాలుగా ఈ సర్వీసు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సర్వీసు కోసం 9177624678 నంబర్ కు కాల్ చేయాల్సిందిగా కోరారు. కేవలం మందుబాబులకే కాకుండా అందరి కోసం సేవలు అందిస్తామని వెల్లడించారు.