24.8 C
Hyderabad
Monday, November 2, 2026

Live Video

spot_img

భారత్‌లో ఎయిర్ ట్యాక్సీకి అడుగులు

భారతదేశంలో ఎయిర్ మొబిలిటీ రంగంలో ఒక పెద్ద పరిణామం చోటు చేసుకోబోతోంది. సర్లా ఏవియేషన్ అనే ఏరోస్పేస్ స్టార్టప్ కంపెనీ దేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ టాక్సీ “శూన్య”ను 2028 నాటికి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. మొదట ఈ సర్వీసులు బెంగళూరులో ప్రారంభించనున్నట్లు కంపెనీ చెబుతోంది. ఆ తర్వాత ఢిల్లీ, ముంబై, నోయిడా, పూణే వంటి నగరాలకు విస్తరిస్తామని అంటున్నారు. ఈ సర్వీసులను ఐదేళ్లలో దేశం అంతటా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సర్లా ఏవియేషన్‌ కంపెనీ సీఈఓ అడ్రియన్ ష్మిట్ తెలిపారు.

ఈ ఎయిర్‌ ట్యాక్సీలకు సంబంధించి ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. ఈ ఎయిర్‌ టాక్సీల ప్రయాణ ఛార్జీలు ఓలా, ఉబర్ ప్రీమియం క్యాబ్ సర్వీస్‌లతో సమానంగా ఉంటుందట. ఫలితంగా మన దేశంలో ఎయిర్‌ ట్యాక్సీలు సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో ఉండనున్నాయి. శూన్య ఎయిర్ టాక్సీ పూర్తిగా ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫారమ్‌పై డెవలప్‌ చేశారు. ఇది గంటకు 250 కిలోమీటర్ల గరిష్ట వేగంతో గాలిలో ప్రయాణిస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 160 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలుగుతుంది. అయితే, ట్రాఫిక్ సమస్య ను అధిగమించడానికి దీనిని 25 నుండి 30 కిలోమీటర్ల దూరంలోని నగరాల మధ్య ప్రయాణాల కోసం మాత్రమే ఉపయోగించాలని కంపెనీ టార్గెట్‌గా పెట్టుకుంది.

ఈ ఎయిర్‌ టాక్సీలో ఒకేసారి ఆరుగురు ప్రయాణికులు, ఒక డ్రైవర్ ప్రయాణించే అవకాశం ఉంటుంది. దీని మొత్తం లోడింగ్ సామర్థ్యం దాదాపు 680 కిలోలు. ప్రస్తుతం శూన్య ఎయిర్‌ ట్యాక్సీ మోడల్‌ను కంపెనీ ప్రదర్శించింది. అయితే, ఈ ఎయిర్‌ ట్యాక్సీ అందుబాటులోకి వచ్చేసరికి ప్రొడక్షన్‌ ప్రాసెస్‌లో మరిన్ని టెక్నికల్‌ అప్‌డేట్స్‌ చేరుస్తామని ఈ కంపెనీ నిపుణులు చెబుతున్నారు. శూన్య ఎయిర్ టాక్సీని కేవలం ప్రయాణీకుల రవాణా కోసం మాత్రమే కాకుండా, అత్యవసర వైద్య సేవల కోసం కూడా ఉపయోగ పడేలా డెవలప్‌ చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని రోగులను ఎమర్జెన్సీ సమయంలో ట్రాఫిక్ కష్టాలను అధిగమించి.. సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ఉచిత ఎయిర్ అంబులెన్స్ సేవలను కూడా ప్రారంభిస్తామని కంపెనీ ప్రకటించింది. ఈ ఆవిష్కరణ భారతదేశ ఏరోస్పేస్ టెక్నాలజీ, గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్ దిశగా ఒక విప్లవాత్మక అడుగుగా చెప్పుకోవచ్చు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com