ఇటీవలే జరిగిన సల్వాన్ మోమికా హత్య ప్రపంచవ్యాప్తంగా స్వీడన్ పేరు మారుమోగిపోయింది. ఈ ఘటన అనేక ఉద్రిక్తతలకు దారి తీసిందనే చెప్పాలి. ఈ హత్య జరిగిన కొన్ని రోజులకే స్వీడన్లో కాల్పులు కలకలం రేపాయి. ఓరెబ్రో ఏరియాలోని ఓ ఎడ్యుకేషన్ సెంటర్లో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు పదిమంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
కాల్పులు జరిగిన ప్రాంతంలో స్వీడన్ పోలీసులు ఆపరేషన్ మొదలుపెట్టారు. కాల్పులు జరిపింది ఎవరు? అనే విషయంపై ఎలాంటి క్లారిటీ రాలేదు. స్వీడన్ అధికారులు కూడా దీనిపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. స్వీడన్లో అశాంతి సృష్టించాలనుకునే వారికి మాత్రం శిక్ష తప్పదని హెచ్చరించారు అక్కడి అధికారులు. కాల్పుల ఘటనతో ముందుజాగ్రత్తగా చుట్టుపక్కల ప్రాంతాల్లోని స్కూళ్లను మూసేశారు.
స్వీడన్లో ఇటీవలే జరిగిన సల్వాన్ మోమికా హత్య ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. 2023లో అతను బహిరంగంగా ఖురాన్ కాపీలను తగలపెట్టాడు. ఈ ఘటన తర్వాత ఆయనకు అనేక బెదిరింపులు వచ్చాయి. రీసెంట్గా అతడిని అపార్ట్మెంట్లో కాల్చి చంపారు దుండగులు. ఇది జరిగిన కొన్ని రోజులకే మళ్లీ స్వీడన్లో కాల్పుల కలకలం రేపడంతో అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి.