28.7 C
Hyderabad
Sunday, April 19, 2026

Live Video

spot_img

ఏబీవీ సస్పెన్షన్‌ కాలం క్రమబద్దీకరణ – ఏపీ సర్కారు సంచలన నిర్ణయం

పదవీ విరమణ పొందిన ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వర్‌రావు విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరూ ఊహించని రీతిలో ఉత్తర్వులు జారీచేసింది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో రెండు సార్లు సస్పెన్షన్‌కు గురైన ఏబీ వెంకటేశ్వర్‌రావుకు సంబంధించిన ఆ సస్పెన్షన్‌ కాలాన్ని క్రమబద్ధీకరిస్తూ ఏపీ సర్కారు ఆదేశాలు జారీచేసింది.

ఏబీవీగా పిలుచుకునే ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వర్‌రావు గత ప్రభుత్వ హయాంలో రెండు సార్లు సస్పెన్షన్‌కు గురయ్యారు. 2020 ఫిబ్రవరి నుంచి 2022 ఫిబ్రవరి 7వ తేదీ వరకు ఒకసారి సస్పెండ్‌ కాగా.. రెండోసారి 2022జూన్‌ 28 నుంచి 2024 మే 30వ తేదీ వరకు ఏబీ వెంకటేశ్వర్‌రావు సస్పెండ్‌ అయ్యారు. ఆయన సస్పెన్షన్‌కు సంబంధించి పలు అభియోగాలు నమోదయ్యాయి. ఆ అభియోగాల మేరకు అప్పటి ప్రభుత్వం ఏబీవీని సస్పెండ్‌ చేసింది.

అయితే, ఏబీ వెంకటేశ్వర్‌రావు సస్పన్షన్‌లో ఉన్న కాలాన్ని క్రమబద్ధీకరిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయన సస్పెన్షన్‌ కాలంలోనూ విధులు నిర్వహించినట్లుగా తాజా ఆదేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com