33.9 C
Hyderabad
Wednesday, June 3, 2026

Live Video

spot_img

సెమీస్ ఫైట్.. టీమ్‌లో కీలక మార్పులు!

మరికొన్ని గంటల్లో ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్‌ ఫైట్ జరగబోతుంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారు అనే దానిపై ఇప్పటికే క్రికెట్ అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే టీమిండియా ప్రత్యర్థి ఆస్ట్రేలియా కాబట్టి. ఆ ఆస్ట్రేలియాతో మనకు అత్యంత చెత్త రికార్డు ఉంది కాబట్టి. ఐసీసీ టోర్నీలు అంటే కంగారు టీమ్‌ ప్రత్యర్థి టీమ్‌లను కంగారు పెడుతుంది కాబట్టి.

ప్రస్తుతం సెమీస్‌ ఫైట్‌లో టీమిండియాకు ఓ అడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే మ్యాచ్‌ దుబాయ్‌లో జరగడం. ఇప్పటికే ఇక్కడి పరిస్థితులకు పూర్తిగా అలవాటు పడ్డారు ప్లేయర్లు. కానీ ఇది అంత సులువు కాదంటున్నారు కెప్టెన్ రోహిత్ శర్మ. మూడు మ్యాచ్‌లు ఆడితే.. ఒక్కోసారి ఒక్కోలా పిచ్ స్పందించింది అని చెబుతున్నారు. అందుకే ఈసారి కూడా నలుగురు స్పిన్నర్లను బరిలోకి దించాలని అనుకుంటున్నామన్నారు రోహిత్. దీంతో ఎవరా నలుగురు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది.

ఇక టీమిండియాకు మొదటి హెడ్ ఎక్.. హెడ్ అనే చెప్పాలి. టీమిండియా అనగానే హెడ్ చెలరేగిపోతాడు. అదే ఇప్పుడు పెద్ద సమస్య అని చెప్పాలి. హెడ్‌ను ఎంత త్వరగా నిలువరిస్తే.. మ్యాచ్ అంత త్వరగా కంట్రోల్‌లోకి రావడం ఖాయం. అయితే స్మిత్, మ్యాక్స్‌వెల్ కూడా చెలరేగకుండా చూడాలి. ఇక రోహిత్, కోహ్లీ నుంచి ఓ భారీ ఇన్నింగ్స్‌ను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అభిమానులు. మరీ ఈ దిగ్గజాలు ఆశలను నిజం చేస్తారా? ఆవిరి చేస్తారా? అనేది చూడాలి.

ఇక పంత్ ఆడతాడా? లేదా? అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. పంత్‌కు ఆస్ట్రేలియాపై మంచి ట్రాక్‌ రికార్డ్ ఉంది. అలాగని రాహుల్‌ను పక్కన పెట్టేంతగా ఏం కనిపించడం లేదు. అయితే కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు కీలకమైన క్యాచ్‌లు వదిలేశాడు రాహుల్. దీంతో టీమ్ మేనేజ్‌మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. అయితే టీమ్‌లో పెద్దగా మార్పులు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదని తెలుస్తోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com