రీసెంట్ గా తెలుగు రాష్ట్రాల్లో బాగా వైరల్ ఐన డైలాగ్ “సీజ్ ది షిప్”. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విసిరిన డైలాగ్ “సీజ్ ది షిప్” యూత్ లో క్రేజ్ గా మారింది. పవన్ సినిమాల్లో కంటే రాజకీయాల్లోనే ఫుల్ బిజీగా ఉన్నారు. అయినప్పటికీ తన నోటి వెంట వచ్చిన ఈ మాట పవన్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది.
పవన్ కళ్యాణ్ బియ్యం అక్రమ రవాణాని అడ్డుకుని సీజ్ ది షిప్ అని అన్న సంగతి తెలిసిందే. సీజ్ ది షిప్ అనే డైలాగ్ సోషల్ మీడియాలో ఇప్పుడు బాగానే వైరల్ అవుతోంది. ఈ డైలాగ్‌నే నిధి అగర్వాల్ తన ఇన్ స్టా స్టోరీలో పెట్టుకుంది. పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు లుక్ పోస్ట్ చేస్తూ.. సీజ్ ది షిప్ అని డైలాగ్ పెట్టేసింది. నిధి వేసిన ఈ పోస్ట్ చూసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు.
కాకినాడ పోర్టు నుంచి బియ్యం రవాణా వ్యవహారంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనామ దేశానికి చెందిన ఒక షిష్‌లో అక్రమంగా విదేశాలకు తరలి వెళుతున్న రేషన్ బియ్యంను పట్టుకుని సీజ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే షిప్‌లో బియ్యాన్ని పట్టుకున్న అనంతరం పవన్‌కల్యాణ్ సీజ్ ద షిప్ అంటూ పలికిన విషయం తెలిసిందే. సినిమా లెవల్ ఎలివేషన్‌తో ఈ మాట అనడంతో సోషల్ మీడియా అంతటా ఆరోజు సీజ్ ద షిప్ అనే డైలాగ్ బాగా వైరల్ అయ్యింది. పవన్ ఫ్యాన్స్ కూడా ఈ మాటను బాగా ట్రెండ్ చేశారు.
ఈ క్రమంలో డైలాగ్ కమర్షియల్ గా మారింది. దీంతో ముందు జాగ్రత్తగా టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సీజ్ ది షిప్ … తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో మూవీ టైటిల్ రిజిస్ట్రేషన్ ఈ రోజు జరిగింది. తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఆర్ ఫిలిం ఫ్యాక్టరీ.. సీజ్ ద షిప్ (Seize The Ship) అనే టైటిల్‌ను రూ.1000లకు నమోదు చేసుకుంది. ఏడాది పాటు టైటిల్ హక్కులు వర్తించనున్నాయి.