32.2 C
Hyderabad
Tuesday, April 21, 2026

Live Video

spot_img

బీసీసీఐ కొత్త రూల్స్ పై రోహిత్ నారాజ్!

  • బీసీసీఐ కొత్త నిబంధనలపై వివాదం
  • స్వయంగా ఒప్పుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ
  • బీసీసీఐ కార్యదర్శితో చర్చిస్తానన్న రోహిత్
  • ఆంక్షలు విధించడం సరైనది కాదంటున్న ప్లేయర్స్
  • ఆంక్షలు వెనుక గౌతమ్ గంభీర్

బిసిసిఐ కొత్త నిబంధనలపై భారత క్రికెట్ ప్లేయర్స్ అసంతృప్తిగా ఉన్నట్టుగా కనిపిస్దితోంది. ఆస్ట్రేలియాలో ఘోర పరాజయం అయిన తర్వాత బీసీసీఐ 10 కొత్త నిబంధనలను తెరపైకి తీసుకువచ్చింది. డొమెస్టిక్ క్రికెట్ ఆడాలన్న నిబంధనలను స్వాగతిస్తున్న ప్లేయర్లు మిగతా వాటి విషయంలో మాత్రం కొంత వ్యతిరేకత చూపుతున్నారు. ముఖ్యంగా బయట టూర్లకు ఫ్యామిలీని అనుమతించకపోవడం, హోటల్ స్పై హాస్టల్ విధించడం, వ్యక్తిగత షూట్స్ చేయకూడదన్న నిబంధనల వల్ల ఇబ్బందులు వస్తాయని అభిప్రాయంతో ప్లేయర్స్ ఉన్నట్లుగా తెలిసింది.

తాజాగా శనివారం ఛాంపియన్ ట్రోఫీకి భారత్ టీం ప్రకటన సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశానికి ముందు టీం కెప్టెన్ రోహిత్ శర్మ బహిరంగంగానే దీనిపై కామెంట్ చేశాడు. ప్రెస్ కాన్ఫరెన్స్ కి ముందు మైక్ ఆన్ లో ఉందనే విషయం గుర్తించకుండా ఈ అంశంపై అయిన చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ తో మాట్లాడారు. అదంతా మైక్ లో రావడంతో మీడియాలో ప్రస్తుత సంచలనంగా మారింది. కొత్త రూల్స్ విషయంపై బీసీసీఐ సెక్రటరీతో మాట్లాడాలని కొన్ని నిబంధనల విషయంలో క్లారిటీ అవసరమని ఈ విషయంపై ప్లేయర్స్ నన్ను అడిగినట్లుగా అజిత్ అగర్కర్ దృష్టికి తీసుకువచ్చాడు రోహిత్ శర్మ.

ప్రపంచంలోనే అత్యంత సంపన్న బోర్డుగా ఉన్న బీసీసీఐ గతంలో ఎన్నడూ లేనివిధంగా ఫ్యామిలీలను తీసుకురాకూడదనే నిబంధన రూపొందించడం పట్ల ప్లేయర్స్ అసంతృప్తిగా ఉన్నారన్న విషయం మరోసారి స్పష్టమైంది. అయితే దీన్ని వివాదం చేయకుండా బోర్డుతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించుకోవాలనే అభిప్రాయంతో వాళ్ళు ఉన్నారు. హెడ్ కోచ్ గంభీర్ సూచన మేరకే ఈ కొత్త నిబంధనలను బోర్డు తీసుకొచ్చినట్లుగా పేర్లు భావిస్తున్నారు. ఫుట్ బాల్ వంటి క్రీడల్లో ఇలాంటి నిబంధనలు లేవని వారు గుర్తు చేస్తున్నారు. మొత్తానికి ఈ వివాదాన్ని పరిష్కరించే బాధ్యత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు ప్లేయర్లు అప్పగించినట్లుగా కనిపిస్తోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com