ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా నిలిచిన టీమిండియాకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. దుబాయ్ వేదికగా ఉత్కంఠభరితంగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా న్యూజిలాండ్ పై ఘన విజయం సాధించటం పట్ల ముఖ్యమంత్రి ఆనందం వ్యక్తం చేశారు. తమ అద్భుత ఆటతీరుతో టీమిండియా మరోసారి ప్రపంచ ఛాంపియన్గా భారత్ సత్తాను చాటి చెప్పిందన్నారు. భారత జట్టులోని ఆటగాళ్లందరికీ ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.