బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన, రూపొందించిన ప్రాజెక్టులకు ఇప్పుడు రేవంత్‌రెడ్డి రిబ్బన్లు కట్ చేసుకుంటూ వెళ్తున్నాడని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు విమర్శించారు. రేవంత్‌రెడ్డి ఇప్పుడు చేస్తున్న ప్రారంభోత్సవాలకు సంబంధించిన ఫ్లైఓవర్లు, భవనాలు, ప్రాజెక్టులు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మొదలయ్యాయయన్నారు. ఈ మాట అడిగినందుకే కేటీఆర్‌పై తప్పుడు కేసులు పెట్టించాడని విమర్శించారు. లగచర్ల గిరిజన రైతుల కోసం కేటీఆర్ ఎంతో కష్టపడ్డారని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటుగా అండగా నిలబడి, న్యాయం చేశాడని అన్నారు. ఇప్పుడు కేటీఆర్ కు ఆపద వస్తే కూడా పార్టీ మొత్తం అండగా నిలబడుతదన్నారు. కేటీఆర్ మీద పెట్టిన కేసు ప్రశ్నించే గొంతుపై, ఒక ఉద్యమకారుడిపై పెట్టిన కేసుగా అభివర్ణించారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రాఫ్ దిగజారిపోతున్నందునే ఇలాంటి కేసులు పెట్టి ప్రజలను డైవర్షన్ చేస్తున్నడని విమర్వించారు. కుట్రలో భాగంగానే కేటీఆర్ పై అక్రమ కేసు పెట్టిండని ఆరోపించారు. ప్రతి నాయకుడికి, కార్యకర్తకు ఆపదొస్తే బీఆర్ఎస్ ఎట్లా నిలబడ్డదో, పార్టీ మొత్తం ఇప్పుడు కేటీఆర్ వెంట ఉంటదన్నారు.