23.4 C
Hyderabad
Friday, July 31, 2026

Live Video

spot_img

హైకోర్టులో ఆర్జీవీకి ఊరట

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఊరట లభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌, మంత్రి నారాలోకేష్‌ల ఫొటోలు రెండు సంవత్సరాల క్రితం మార్ఫింగ్‌ చేసి తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేసినట్లు రామ్‌గోపాల్‌ వర్మపై కూటమి అధికారంలోకి వచ్చాక టీడీపీ నాయకులు కేసులు పెట్టారు. ఆ కేసుల్లో ఆరు వారాల పాటు రామ్‌ గోపాల్‌ వర్మపై చర్యలు నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి కేసు విచారణను ఏప్రిల్‌ 17వ తేదీకి వాయిదా వేస్తు న్యాయస్ధానం నిర్ణయం తీసుకుంది. కులాల మధ్య మనస్పర్ధలు రేపే విధంగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా తీశానని, సోషల్‌ మీడియాలో మార్ఫింగ్‌ ఫొటోలు సర్క్యులేట్‌ చేశానని ఆరోపిస్తూ తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని రామ్‌గోపాల్‌ వర్మ హైకోర్టున ఆశ్రయించారు. వర్మ పిటీషన్‌పై విచారించిన ఏపీ హైకోర్ట్‌ వర్మపై చర్యలను ఆరు వారాల పాటు నిలుపుదల చేస్తూ తరువాత విచారణను వచ్చే నెల 17వ తేదీకి వాయిదా వేసింది. నిన్న బుధవారమే గుంటూరు సీఐడీ కార్యాలయం నుంచి విచారణకు హాజరు కావాలని రెండో సారి రామ్‌ గోపాల్‌ వర్మకు నోటీసులు జారీ చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com