28.7 C
Hyderabad
Sunday, April 19, 2026

Live Video

spot_img

విశాఖ‌లో 27న ప‌ర్యాట‌క పెట్టుబ‌డిదారుల స‌ద‌స్సు

రీజిన‌ల్ టూరిజం ఇన్వెస్ట‌ర్స్ ఎంగేజ్మెంట్ పేరుతో ఈ నెల 27వ తేదీన విశాఖ‌ప‌ట్ట‌ణం వేదిక‌గా రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ ఆధ్వ‌ర్యంలో ప్రాంతీయ ప‌ర్యాట‌క పెట్టుబ‌డిదారుల స‌ద‌స్సు జ‌రగ‌నున్న‌ట్లు జిల్లా ప‌ర్యాట‌క శాఖ అధికారిణి కె. జ్ఞాన‌వేణి ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. స్థానిక నోవోటెల్ హోట‌ళ్లో ఆ రోజు ఉద‌యం 10.00 గంట‌ల నుంచి స‌ద‌స్సు జ‌రుగుతుంద‌ని, జాతీయ స్థాయిలోని దిగ్గ‌జ కంపెనీల ప్ర‌తినిధులు భాగ‌స్వామ్యం కానున్నార‌ని చెప్పారు. ప‌ర్యాట‌క రంగంలో పెట్టుబ‌డులను ఆక‌ర్షించే నిమిత్తం ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

అడ్వెంచ‌ర్, క్రూయిజ్ టూరిజం, ఎకో టూరిజం, అర‌కు కాఫీ, 2024-29 న్యూ టూరిజం పాల‌సీపై చర్చ జ‌రుగుతుంద‌ని, దిగ్గ‌జ కంపెనీల ప్రతినిధులు, అధికార ప్ర‌తినిధులు చ‌ర్చిస్తార‌ని తెలిపారు. ఈ స‌ద‌స్సులో రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి, ఛైర్మ‌న్, సీఎస్, ప‌ర్యాట‌క శాఖ ఎండీ, ఇత‌ర ఉన్నాతాధికారులు, ప్ర‌జా ప్ర‌తినిధులు, జిల్లా క‌లెక్ట‌ర్, ఇత‌ర అధికారులు భాగ‌స్వామ్యం అవుతార‌ని ఆమె ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com