27.8 C
Hyderabad
Sunday, July 12, 2026

Live Video

spot_img

రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సంవత్సరం రికార్డు స్ధాయిలో రైతుల నుంచి ధాన్యం సేకరణ చేస్తున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. నిన్నటి వరకూ 1,61,568 మంది రైతుల నుంచి 11 లక్షల 22వేల 699 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఏపీ ప్రభుత్వం  సేకరించగా. ఈ మొత్తం ధాన్యం సేకరణకు 2584.62 కోట్ల రూపాయలను వెచ్చించినట్లు ఆయన తెలిపారు. తాజాగా మరో లక్షా 67వేల 299 మంది రైతుల నుంచి 2678.63 కోట్ల రూపాయలతో 11 లక్షల 63వేల 510 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించినట్లు మంత్రి వివరించారు. సేకరించిన ధాన్యానికి డబ్బులను కేవలం 48 గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆరుగాలం శ్రమించే రైతన్నకు కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తోందని నాదెండ్ల పేర్కొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com