వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్‌కు ఓ ఫీస్ట్ అనే చెప్పాలి. ముంబై భయపెట్టినా.. చివరికి గెలుపు మాత్రం ఆర్సీబీనే వరించింది. ఒకానొక దశలో తిలక్ వర్మ, హార్ధిక్ పాండ్యా విజృంభిస్తుంటే RCB ఫ్యాన్స్ అయితే మ్యాచ్‌పై ఆశలు వదిలేసుకున్నారనే చెప్పాలి. కానీ భువనేశ్వర్, హేజిల్ వుడ్ పుణ్యమా అని మ్యాచ్ టర్న్ అయ్యింది. గెలుపు బెంగళూరుదే అయ్యింది. దీంతో అప్పుడెప్పుడో 2015 తర్వాత తొలిసారి వాంఖడే స్టేడియంలో ముంబైని బీట్ చేసింది బెంగళూరు.
మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు పరుగుల వరద పారించిందనే చెప్పాలి. ఫిల్ సాల్ట్ రెండో బంతికే వెనుదిరిగినా.. విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. ఏకంగా 67 పరుగులు చేశాడు. ఇక పడిక్కల్, పాటీదార్ కూడా మెరుపులు మెరిపించారు. దీపక్ చాహర్ వేసిన ఆరో ఓవర్‌లో వరుసగా రెండు సిక్స్‌లు ఒక ఫోర్ బాదాడు పడిక్కల్. పడిక్కల్ ఔట్ అయినా బెంగళూరు జోరు తగ్గలేదు. ఓ వైపు విరాట్.. మరోవైపు పాటీదార్ పరుగుల వరద పారించారు. కోహ్లీ, లివింగ్‌స్టన్‌లు హార్దిక్ ఔట్ చేయగా.. జీతేష్ శర్మ క్రీజులోకి తన ప్రతాపం చూపించాడు. దీంతో RCB అలవోకగా 221 పరుగులు చేసింది.
222 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ముంబై.. ధాటిగానే ఇన్సింగ్స్‌ను ఆరంభించింది. కానీ తొలి మూడు వికెట్లను త్వరగా కోల్పోయింది. రోహిత్, రికిల్‌టన్, విల్ జాక్స్, సూర్య కుమార్ భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయారు. దీంతో మ్యాచ్ ఓటమి తప్పదని అర్థమైంది. కానీ తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా సీన్‌ను మార్చేశారు. హార్దిక్ బెంగళూరు బౌలర్లపై వీర విహారమే చేశాడు. 11 బంతుల్లోనే 33 పరుగులు చేశాడు. అయితే జోరు మీదున్న తిలక్‌ను మొదట భువనేశ్వర్ పెవిలియన్‌కు పంపగా.. ఆ తర్వాత హేజిల్ వుడ్ హార్దిక్‌ను ఔట్‌ను చేశాడు. దీంతో మ్యాచ్ మళ్లీ RCB కంట్రోల్‌లోకి వచ్చింది. ఇక చివరి ఓవర్ కృనాల్ పాండ్యా మ్యాజిక్ చేశాడు. ఆఖరి ఓవర్‌లో కేవలం ఆరు పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు కృనాల్. దీంతో RCB సంబరాలు ప్రారంభమయ్యాయి.