26.5 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

తెలంగాణలో రేషన్ కార్డులు – స్టేటస్ ఎలా చెక్ చేయాలి?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెలుపు రంగు రేషన్ కార్డుల జారీకి రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. మీసేవా కేంద్రాల ద్వారా, ప్రజాపాలన శిబిరాల ద్వారా లక్షల మంది రేషన్‌ కార్డుల కోసం అప్లికేషన్‌లు పెట్టుకున్నారు. అయితే, చాలామందికి తమ దరఖాస్తు స్టేటస్ ఏంటో తెలియక ఆందోళన చెందుతున్నారు. రేషన్‌ దుకాణాలకు వెళ్లి వాకబు చేస్తున్నారు. అయితే, రేషన్‌ కార్డు స్టేటస్‌ ఎలా చెక్‌ చేసుకోవాలో భాస్కర న్యూస్‌ పాఠకులకోసం ప్రత్యేకం…

రేషన్ కార్డు స్టేటస్ చెక్ చేసే స్టెప్స్ :

1. తెలంగాణ ఫుడ్ సెక్యూరిటీ వెబ్‌సైట్‌కి వెళ్లండి :
[https://epds.telangana.gov.in/FoodSecurityAct/](https://epds.telangana.gov.in/FoodSecurityAct/)

2. ‘Ration Card’ మెనూ పై క్లిక్ చేయండి

3. అందులో ‘FSC Application Search’ ఆప్షన్ ఎంచుకోండి

4. తర్వాత ఓ విండో ఓపెన్ అవుతుంది:
– ముందుగా మీ జిల్లా పేరు సెలెక్ట్ చేసుకోండి.
– ఆపై ‘మీ సేవా అప్లికేషన్ నంబర్’ ఎంటర్ చేయండి

5. ‘Search’ బటన్ క్లిక్ చేస్తే :
– దరఖాస్తు పరిస్థితి తెలుస్తుంది
– మీరు చేసిన అప్లికేషన్ ప్రాసెస్‌లో ఉందా? లేక రిజెక్ట్ అయిందా? అన్నది క్లియర్‌గా కనిపిస్తుంది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com