28 C
Hyderabad
Tuesday, March 10, 2026

Live Video

spot_img

పుష్ప-2 సినిమా థియేటర్‌ వద్ద మహిళ మృతి – బాలుడు సహా ఇద్దరికి తీవ్ర అస్వస్థత

– లోపల సినిమా చూస్తున్న అల్లు అర్జున్‌
– థియేటర్‌ బయట తొక్కిసలాటలో మహిళ దుర్మరణం
– ఓ బాలుడు, మరో వ్యక్తికి తీవ్ర గాయాలు

అల్లు అర్జున్‌ నటించిన బ్లాక్‌ బస్టర్‌ ఫిలిం పుష్ప-2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్‌లో బెనిఫిట్‌ షోను హీరో అల్లు అర్జున్‌ తన ఫ్యాన్స్‌తో కలిసి పుష్ప-2 సినిమా చూశారు. అయితే, అదే సమయంలో థియేటర్‌ బయట అభిమానుల కోలాహలం నెలకొంది. ఫ్యాన్స్‌ పెద్ద మొత్తంలో తరలిరావడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. ఈ సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించింది. మరో బాలుడు, ఓ వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాళ్లను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆసమయంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. అయితే, అదే సమయంలో ఓ మహిళ తొక్కిసలాటలో ఊపిరాడక అస్వస్థతకు గురయ్యింది. ఆమెను వెంటనే ప్రథమచికిత్స చేసి ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి వెళ్లేలోగానే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. మరణించిన మహిళను రేవతిగా గుర్తించారు. మరోవైపు.. ఇంకో బాలుడు తొక్కిసలాటలో స్పృహ కోల్పోయాడు. అతనికి అక్కడే ఉన్న పోలీసులు సీపీఆర్‌ చేశారు. కిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. బాలుడికి ప్రస్తుతం ఐసీయూలో వెంటిలెటర్‌పై చికిత్స అందిస్తున్నారు. వీరితో పాటు మరో వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డాడని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు ప్రకటించారు.

 

ఇక, దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి తన భర్త భాస్కర్ , ఇద్దరు పిల్లలు శ్రీ తేజ్, సన్వీకతో కలిసి పుష్ప ప్రీమియర్ షో చూడటానికి ఆర్టీసీ రోడ్స్ లోని సంధ్య థియేటర్‌కు వచ్చింది. అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వచ్చిన సమయంలో అభిమానులు థియేటర్ గేటు లోపలికి చొచ్చుకు వచ్చారు. ఈ సమయంలో జరిగిన తొక్కిసలాట లో రేవతి , ఆమె కొడుకు శ్రీ తేజ లు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే పోలీసులు విద్య నగర్ లోని దుర్గ భాయి దేశముఖ్ హాస్పిటల్ కు తరలించారు. రేవతి అప్పటికే మృతి చెందగా , శ్రీ తేజ పరిస్థితి విషమంగా ఉండటంతో బాలుడిని బేగంపేట కిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. రేవతి మృతదేహాన్ని దుర్గాబాయి దేశముఖ్ హాస్పిటల్ నుండి గాంధీ మార్చురీకి తరలించారు

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com