28 C
Hyderabad
Tuesday, March 10, 2026

Live Video

spot_img

తెలంగాణ తల్లి విగ్రహంపై హైకోర్టుకు

తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులను వ్యతిరేకిస్తున్న తెలంగాణ ప్రజలు,మేధావులు,రచయితలు,కవులు, కళాకారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. డిసెంబర్ 9న సచివాలయం వద్ద తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టను ఆపాలని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

నూతన తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై హైకోర్టులో పిటిషన్ వేసిన జూలూరి గౌరీ శంకర్…విగ్రహంలో మార్పులు అంటే తెలంగాణ అస్తిత్త్వంపై జరుగుతున్న దాడిగా ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ సమాజం నిరసన తెలుపుతోందన్నారు.

తెలంగాణ నా కోటి రథనాల వీణ అని మహాకవి దాశరధి అన్నట్టుగానే.. నాడు ప్రొఫెసర్ జయశంకర్,తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అనేక మంది మేధావులు,తెలంగాణ ఆత్మబంధువుల సమక్షంలో రూపకల్పన చేశారని గుర్తు చేశారు. ఉద్యమకాలంలో రూపుదిద్దుకున్న తెలంగాణ తల్లిని కేసీఆర్ మీద రాజకీయ కక్షతో మార్చుతున్నారని విమర్శించారు. తెలంగాణ మీద ఈసమెత్తు కూడా అవగాహన,సోయి లేని వ్యక్తి నేడు కుట్రలు చేయడాన్ని తెలంగాణ సమాజం ఖండిస్తోందన్నారు.

తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయకుండా, మార్చిన విగ్రహం డిసెంబర్ 9న ఏర్పాటు చేయాలని చూస్తున్నారని… ప్రతిష్టను ఆపాలని ప్రముఖ రచయిత జూలూరి గౌరీ శంకర్ నేతృత్వంలో అనేక మంది మేధావులు హైకోర్టు లో పిల్ వేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com