వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (వేవ్స్)లో భాగం కావడం సంతోషంగా ఉందని సినీ నటుడు చిరంజీవి తన ఎక్స్ ఖాతాలో ఆనందాన్ని పంచుకున్నారు. భారదేశాన్ని ప్రపంచానికే ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం ఈ సంవవత్సరం ఆఖరున వేవ్స్ సమ్మిట్‌ను నిర్వహించనుంది. దీన్ని పురస్కరించుకుని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, నటులతో ప్రధాని నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధాని మోడీ నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాలుపంచుకున్న చిరంజీవి ఆ వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు. వేవ్స్ అడ్వైజరీ బోర్డులో తానను కూడా భాగస్వామిని చేయడం పట్ల ప్రధాని మోడీకి చిరంజీవి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రధాని మోడీ ఆలోచనలు దేశాన్ని ముందుకు నడిపిస్తాయనడంలో ఎటువంటి అనుమానం లేదని చిరంజీవి ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రధాని మోడీ వీడియోకాన్ఫరెన్స్‌లో చిరంజీవితో పాటు అమితాబ్ బచ్చన్, మిధున్ చక్రవర్తి, రజనీకాంత్, నాగార్జున, షారూక్‌ఖాన్, అక్షయ్‌కుమార్, అమీర్‌ఖాన్, అనుపమ్‌ఖేర్, అనిల్‌కపూర్, దీపికా పదుకొనె, హేమమాలిని, పారిశ్రామిక దిగ్గజాలు ముకేష్ అంబాని, ఆనంద్ మహేంద్రా తదితరులు పాల్గొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని నరేంద్ర మోడీ సినీ నటుడు చిరంజీవి పేరు ఉటంకించడంతో ఆ వీడియో క్లిప్‌ని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు చిరం