ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రంలోని గిర్ వైల్డ్‌లైఫ్ సాంచురీని సందర్శించారు. సొంత రాష్ట్రం గుజరాత్లో మూడు రోజుల పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ సోమవారం జూనాగఢ్ జిల్లాలో ఉన్న గిర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి వెళ్లారు. ఈ పర్యటనలో ప్రధాని లయన్ సఫారీ నిర్వహిచారు. భూమ్మీద ఉన్న అపురూపమైన జీవరాశులను కాపాడుకోవడానికి ప్రజలంతా కృషి చేయాలని ఈ సందర్భంగా ప్రధాని పిలుపునిచ్చారు. భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించాలంటే ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందన్నారు. ముఖ్యమంత్ర వన్య ప్రాణుల సంరక్షణ విషయంలో మన దేశం అనుసరిస్తున్న విధానల పట్ల తనకు గర్వంగా ఉందన్నారు. సోమవారం వేకువ జామునే గిర్ వైల్డ్ లైఫ్ సాంచురీకి వెళ్లిన ప్రధాని మధ్యాహ్నం వైల్డ్ లైఫ్ సాంచురీకి ప్రధాన కార్యాలయం ససన్గిర్లో జరిగే నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్‌లైఫ్ కార్యక్రమానికి అధ్యక్షత వహించనున్నారు. వన్యప్రాణి సంరక్షణకు కృషి చేస్తున్న పలు ఎన్జీఓ సంస్ధల ప్రతినిధులు, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, పలువరు మంత్రులు, అటవీశాఖ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అయితే ప్రాజెక్ట్ లయన్ పేరుతో ఆసియా సింహాల సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం 2900 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్లు సమాచారం. గిర్ సాంచురీలో దాదాపు674కి పైగా అసియా సింహాలు ఉన్నట్లు అంచనా.