ప్రముఖ రచయిత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళి నేడు శనివారం గుంటూరు జైలు నుంచి విడుదల కానున్నారు. సీఐడీ కేసులో గుంటూరు కోర్టు పోసానికి నిన్న శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన ఈ రోజు జైలు నుంచి విడుదల కానున్నారు. గతంలో ఎప్పుడో చంద్రబాబునాయుడు, నారాలోకేష్, పవన్ కళ్యాణ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మనోభావాలు దెబ్బతిన్నాయని టీడీపీ, జనసేన కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా 18 కేసులు పెట్టారు. ఆ కేసులన్నింటినీ నమోదు చేసుకున్న పోలీసులు గత నెల 26వ తేదీన పోసాని కృష్ణ మురళిని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు. ఈ కేసుల్లో ఒక్కో పీటీ వారెంట్ తీసుకుంటూ పోలీసులు పోసాన్ని రాష్ట్రమంతా తిప్పారు. అయితే పోసాని కోర్టును ఆశ్రయించగా గుంటూరు కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. దీంతో దాదాపు 24 రోజుల పాటు రాష్ట్రంలోని వివిధ జైళ్ళలో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని కృష్ణ మురళి శనివారం విడుదల కానున్నారు.
- Advertisement with us -