- శనివారం రాత్రి నుంచి ఛాతి నొప్పితో బాధపడుతున్న పోసాని
- రాజంపేట సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని
ప్రముఖ సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి తీవ్ర అస్వస్ధతకు గురయ్యారు. ప్రస్తుతం రాజంపేట సబ్‌జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని శనివారం ఉదయం అస్వస్ధతకు గురియ్యారు. జైలు సిబ్బంది వెంటనే ఆయన్ను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిచారు. అయితే పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించిన రాజంపేట ప్రభుత్వాసుపత్రి వైద్యులు ఈసీజీలో గెండెకు సంబంధించిన సమస్య గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో మెరుగైన చికిత్స కోసం ఆయన్ను కడప ప్రభుత్వాసుపత్రికి తరలించాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వాస్తవానికి పోసానికి రాజంపేట జైలులో ఉన్న పోసాని కృష్ణమురళి శనివారం రాత్రి నుంచి ఛాతి నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని నిన్న ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి కూడా మీడియాకు వెల్లడించారు. రాజంపేట సబ్‌జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని కృష్ణమురళిని పలువురు వైఎస్‌ఆర్సీపీ నాయకులు వెళ్ళి పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే రాజంపేట శాసనసభ్యుడు ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి శనివారం రాజంపేట సబ్‌జైలులో పోసానితో ములాఖాత్ అయ్యారు. అనంతరం అమర్నాథ్‌రెడ్డి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ పోసాని ఛాతి నొప్పితో బాధపడుతున్నారని ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని వెల్లడించారు. ఆదివారం ఉదయం ఛాతినొప్పి తీవ్రం అవ్వడంతో జైలు అధికారులు పోసానిని వైద్య చికిత్స నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఈసీజీ పరీక్షల్లో స్వల్ప తేడాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ కి పోసానిని తరలించారు.