భక్తుల కోలాహలం మధ్య దురాజ్ పల్లి పెద్దగట్టు జాతర ఈ రోజు ప్రారంభం అయింది. మాఘమాసంలో వచ్చే తొలి ఆదివారం నుంచి 20వ తేదీ వరకు(ఐదు రోజుల పాటు) జాతర కొనసాగతుంది. తెలంగాణలో మేడారం తర్వాత రెండో అతిపెద్ద జాతరగా పేరుంది. రెండేళ్లకు ఒకసారి దురాజ్ పల్లి జాతర జరుగుతుంది.
దీన్నే లింగమంతుల జాతర, గొల్ల గట్టు జాతర, పెద్ద గట్టు జాతరగా పిలుచుకుంటారు. లింగ నామస్మరణతో పెద్దగట్టు మారుమోగుతోంది. భక్తులు బోనాలు సమర్పించి గొర్రెలు, మేకలు బలి ఇచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. లక్షలాదిగా తరలివస్తున్న భక్తులతో సూర్యపేట వరకు ట్రాఫిక్ అధికంగా ఉంది. ఈ ఏడాది 20 లక్షల మంది భక్తులు బోలా శంకరుని దర్శనానికి రానున్నారని అంచనా.
ఈ నేపథ్యంలో విజయవాడ-హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగించే NH-65 పై వాహనాల దారి మళ్లింపు ఉంటుందని జిల్లా పోలీసు అధికారులు తెలిపారు. ఈ రోజు ఉదయం నుంచే వాహనాల మళ్లిస్తున్నారు. ఆంక్షలు ఉంటాయని వెల్లడించారు.
నార్కట్ పల్లి వద్ద మళ్ళింపు:
హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్ళే వాహనాలను నార్కట్ పల్లి వద్ద మళ్లించి నల్గొండ మీదుగా మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ మీదుగా విజయవాడకు పంపిస్తారు.
టేకుమట్ల వద్ద మళ్ళింపు:
హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లే వాహనాలను టేకుమట్ల వద్ద జాతీయరహదారి 365 BB మీదుగా మళ్లిస్తారు.
కొదాడ వద్ద మళ్ళింపు:
విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే వాహనాలను కోదాడ వద్ద మళ్లించి హుజూర్ నగర్, నేరేడుచర్ల, మిర్యాలగూడ, నల్గొండ, నార్కట్ పల్లి మీదుగా హైదరాబాద్ కు పంపిస్తున్నారు.