జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వాళ్లకు స్మృతిగా న్యూజెర్సీలోని ఎడిసన్‌లో ప్రవాస భారతీయులు ఘనంగా నివాళులర్పించారు. ఎడిసన్‌లోని శ్రీ శివ విష్ణు ఆలయంలో.. సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో .. స్మృతిస నిర్వహించారు. కొవ్వొత్తులు వెలిగించి మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, ప్రవాస భారతీయ కుటుంబ సభ్యులు, స్థానికులు కూడా పాల్గొన్నారు. ఇలాంటి బాధాకరమైన సమయంలో మృతుల కుటుంబాలకు భరోసా ఇవ్వాల్సిన ఆవశ్యకతను ప్రవాస భారతీయులు వ్యక్తం చేశరు. ఉగ్రదాడిలో మరణించినవారికి ఘనంగా నివాళులు అర్పించి, వారి కుటుంబాలకు మానసిక బలాన్ని అందించాలని భగవంతుడిని ప్రార్థించారు.
ఈ సందర్భంగా కార్యక్రమం నిర్వాహకులు, ప్రవాస భారతీయులు మాట్లాడుతూ.. ఈ బాధాకర సంఘటనలో మృతి చెందినవారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అందరం ఐకమత్యంగా ఉంటే ఇలాంటి ముష్కర మూకలను ఎదురొడ్డి వాళ్ల కుటిల ఆలోచనలను తిప్పికొట్టగలుగుతామన్నారు. ఈ సందర్భంగా సాంప్రదాయ ప్రార్థనలు నిర్వహించారు.