- అందులో సక్సెస్ అయినవి కేవలం 150
- డమ్మీ వెబ్ సైట్స్ తో మన సైట్స్ ని హ్యాక్ చేసే యత్నం
- మాల్ వేర్, డీడీఓఎస్ టాక్స్,మిస్ ఇన్ఫర్మేషన్ ల రూపంలో
- అన్నీ విదేశాలనుంచే ఆపరేట్ చేస్తున్న తీరు
- భారతీయ వ్యవస్థలను కొల్లగొట్టామని అబద్ధాల ప్రచారం
- అడ్వాన్స్ డ్ పెర్సిస్టెంట్ త్రెట్ పేరుతో దాడులు
- రోడ్ ఆఫ్ సింధూర్ పేరుతో నివేదిక
- పెహల్గాం దాడుల తర్వాత పరిస్థితిపై అంచనా నివేదిక
- తగ్గుముఖం పట్టినా.. పూర్తిగా తగ్గలేదంటున్నఅధికారులు
ఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్ కు గట్టి ఝలక్ ఇచ్చినా ఆ దేశం ఇంకా మనపై కుటిల యత్నాలకు పాల్పడుతూనే ఉంది. తాజాగా సైబర్ దాడులను ఉథృతం చేసింది. ఇప్పటికే పాకిస్థానీ హ్యాకర్లు సమయం దొరికినప్పుడల్లా మన త్రివిధ దళాల రహస్య సమాచారం హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా, ఇప్పుడు తాజాగా భారత కీలక మౌలిక వనరులపై వ్యూహాత్మకంగా సైబర్ దాడులు పెరిగాయి.అడ్వాన్స్ డ్ పెర్సిస్టెంట్ త్రెట్ పేరుతో పాకిస్థాన్ అనుబంధ గ్రూపులు ఈ దాడులకు పాల్పడుతున్నాయి.ఈ గ్రూపులన్నీ ఇప్పటి వరకూ దాదాపు 15 లక్షల సైబర్ దాడులను ఒకేసారి మొదలు పెట్టగా ..ఇందులో కేవలం 150 దాడులు సక్సెస్ అయ్యాయి. అంటే దాడుల సక్సెస్ రేట్ 0.01 శాతం మాత్రమే. ఈ సంస్థలు మాల్ వేర్, డీడీఒఎస్ ఎటాక్స్,తప్పుడు సమాచార వ్యాప్తి తదితరాల రూపంలో సైబర్ దాడులకు పాల్పడుతున్నాయి.పాకిస్థాన్, బంగ్లాదేశ్,మధ్యప్రాచ్యం, ఇండోనేషియా దేశాలనుంచి ఈ అటాక్స్ జరుగుతున్నాయి. ఈ దాడుల మూలంగా కొంత డాటా, కొంత సాఫ్ట్ వేర్ చోరీ జరిగిందని మహారాష్ట్ర సైబర్ శాఖ గుర్తించింది.
భారత, పాక్ మధ్య కాల్పుల విరమణ అవగాహన కుదిరిన తర్వాత కూడా ఈ దాడులు జరిగాయి. భారత పాకిస్థాన్ దేశాల మధ్య శతృత్వాలు తగ్గాక ప్రభుత్వ వెబ్ సైట్లపై సైబర్ దాడులు బాగా తగ్గాయి. కానీ పూర్తిగా తగ్గలేదు. ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఏవియేషన్ వ్యవస్థలను, మున్సిపల్ నెట్ వర్క్స్, లేదా ఎలక్షన్ కమిషన్ వెబ్ సైట్ ను హ్యాక్ చేశామని హ్యాకర్లు చెప్పుకుంటుండగా అలాంటిదేమీ లేదని అధికారులు స్పష్టం చేశారు.ఉగ్రవాదులపై ఇండియన్ మిలటరీ ఆపరేషన్ తర్వాత ఈ సైబర్ దాడుల వెల్లువను పరిశీలించిన అధికారులు రోడ్ ఆఫ్ సిందూర్ పేరిట ఒక రిపోర్టును వెలువరించారు.ఈ సైబర్ దాడుల తీరు, తెన్నును విశ్లేషిస్తూ న్న నివేదికను ఇంటెలిజెన్స్ డిపార్టుమెంటుకు, పోలీసు డైరక్టర్ జనరల్ కు అందచేశారు.పెహల్గాం ఉగ్రదాడి తర్వాత సైబర్ శాఖ రూపొందించిన ఎకోస్ ఆఫ్ పెహల్గాం రిపోర్ట్ తర్వాత దాని ఆధారంగా రూపొందించినది రోడ్ ఆఫ్ సిందూర్. ఈ కొత్త రిపోర్టులో ఏడు కొత్త హ్యాకింగ్ గ్రూపులను కనుగొన్నారు. అవేంటంటే ఏపీటి 36,పాకిస్థాన్ సైబర్ ఫోర్స్, టీమ్ ఇనసాన్ పీకే,మిస్టీరియస్ బంగ్లాదేశ్, ఇండో హాక్స్ సీక్రెట్ సైబర్ గ్రూప్ హోక్స్ 1337,నేషనల్ సైబర్ క్రూ పేరిట ఈ గ్రూపులు పనిచేస్తున్నాయి. ఈ హ్యాకింగ్ గ్రూపులు నిరంతరగా చేస్తున్న దాడిలో 150 ప్రయత్నాలు సఫలమయ్యాయి.కుల్గోన్, బద్లాపూర్ మున్సిపల్ కౌన్సిల్ వెబ్ సైట్ ను జలంధర్ లోని డిఫెన్స్ నర్సింగ్ కాలేజ్ వెబ్ సైట్ ను కూడా ధ్వంసం చేశారు.
ఈ పాక్ అనుకూల హ్యాకింగ్ గ్రూపులు తాము భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థను హ్యాక్ చేశామని, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగించామని తప్పుగా చెప్పుకున్నాయి.మహారాష్ట్ర సైబర్ శాఖ దాదాపు అయిదువేల రకరకాల ఫేక్ న్యూస్ లను గుర్తించింది. మరో 80 తప్పుడు సమాచారం లేఖలను తొలగించింది.ఈ హ్యాకర్లు తాము పవర్ గ్రిడ్ల పై దాడి చేశామని, శాటిలైట్ వ్యవస్థను జామ్ చేశామని, నార్తరన్ కమాండ్ కు అంతరాయం, బ్రహ్మోస్ మిసైల్ స్టోరేజ్ ఫెసిలిటీ లను హ్యాక్ చేసేందుకు ప్రయత్నించామనీ చెప్పుకుంటున్నాయి. కానీ వాస్తవానికి అటువంటిదేమీ లేదు.