దక్షిణ ఢిల్లీ, వాయవ్య ఢిల్లీ పరిసరాల్లో ఇవాళ పోలీసులు సెర్చ్ ఆపరేషన్స్‌లో 20 మందికి పైగా బంగ్లాదేశీ చొరబాటు దారులను గుర్తించారు. వీరంతా సరైన డాక్యుమెంట్లు లేకుండా మన దేశంలోకి చొరబడి, అక్రమంగా ఉంటున్నట్లు గుర్తించారు. 13 మందిని దక్షిణ ఢిల్లీలోనూ, మరో 11 మందిని వాయవ్య ఢిల్లీలోనూ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరికి తోడు మరో పది మంది డాక్యుమెంట్లను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈనెల 8వ తేదీన వసంత్ కుంజ్ ఏరియాలో జై హింద్ క్యాంప్ లో కూడా ఇమ్మిగ్రెంట్లు ఉన్నట్లుగా సమాచారం అందుకున్న పోలీసులు వారి డాక్యుమెంట్లను పరిశీలించారు. ఆ అక్రమ చొరబాటుదారుల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించాక ఐడీ ప్రూఫ్ లను కూడా పరిశీలించారు. సీనియర్ ఢిల్లీ పోలీసులు కూడా ఈ చొరబాటు దారులను గుర్తించే విషయమై ఒక స్పెషల్ బృందం పని చేయాలని అభిప్రాయపడ్డారు. ఇళ్లలో వంటవారుగా, పనివారుగా, హెల్పర్లుగా, నిర్మాణ రంగంలో కూలీలుగా చెలామణి అయ్యేవారి వివరాలను ప్రజలకు తెలిపి అప్రమత్తంగా ఉండేలా చేయాలని ఢిల్లీ గవర్నర్ సక్సేనా ఆదేశించారు. సోషల్ మీడియా ద్వారా విస్తృతమైన ప్రచారం కల్పించాలని సూచించారు.