కూటమి ప్రభుత్వం పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ పేరుతో నిర్వహిస్తున్నది విద్యా మీట్ కాదని అది దగా మీట్ అని మాజీ మంత్రి మేరుగ నాగార్జున వ్యాఖ్యానించారు. శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మేరుగ మాట్లాడుతూ వైఎస్.జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రిగా విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని తెలిపారు. నాడు నేడు కింద రాష్ట్రంలో 45వేల స్కూళ్ళ రూపురేఖలు మార్చిన జగన్ విద్యారంగంలో ఎవరూ ఊహించని మార్పులు తెచ్చారని చెప్పారు. అయితే చంద్రబాబు వచ్చాక ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు, అద్భుతమైన మధ్యాహ్న భోజనం, ట్యాబులు అన్నింటినీ విద్యార్థులకు దూరం చేశారని విమర్శించారు. విద్యారంగలో పేరుకుపోయిన 3900 కోట్ల రూపాయల బకాయిల గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడరని మాజీ మంత్రి ప్రశ్నించారు. ఇరవై మంది వైస్ ఛాన్సిలర్లను బెదిరించి రాజీనామాలు చేయించి ఇప్పటి వరకూ వేరేవాళ్ళను నియమించలేదని మేరుగ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Advertisement with us -