27.2 C
Hyderabad
Monday, November 2, 2026

Live Video

spot_img

ఇక ఫ్యామిలీ ట్రిప్‌లు కుదరవు.. బీసీసీఐ షాకింగ్ రూల్స్

టీమిండియా ఆటగాళ్లకు బీసీసీఐ షాకిచ్చింది. ఇకపై విదేశీ టూర్లకు ప్లేయర్ల ఫ్యామిలీలకు వెళ్లేందుకు నో అని చెప్పేసింది. బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో ఓడిన తర్వాత బీసీసీఐ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. హెడ్ కోచ్ గంభీర్‌కు సైతం ఆంక్షలు విధించింది. తనతో పాటు పర్సనల్ మేనేజర్‌ను జట్టుతో బస్‌లో ప్రయాణించనివ్వొద్దు అంటూ బీసీసీఐ తేల్చిచెప్పింది.

BGT సిరీస్ కీలకమైనప్పటికీ ఆటగాళ్లలో గెలవాలనే తాపత్రయం కనిపించలేదు. వరుసగా టెస్టుల్లో ఓడుతున్నా.. పరుగులు చేయడంలో విఫలమవుతున్నా.. భారత క్రికెటర్లలో ఎటువంటి నిరుత్సాహం కనిపించలేదు. పోతే పోయిందిలే అన్నట్టు.. భార్య, పిల్లలతో కలిసి ఆస్ట్రేలియా వీధుల్లో ఎంజాయ్ చేశారు. దీనిపై పదే పదే విమర్శలు వస్తుండటంతో బీసీసీఐ అప్రమత్తం అయ్యింది. రూల్స్ మార్చేసింది.

బీసీసీఐ విధించిన రూల్స్

* ఆటగాళ్లు తమ భార్యతో కలిసి టోర్నీ మొత్తం ఉండలేరు. ఒకవేళ టోర్నీ 45 లేదా అంతకన్నా ఎక్కువ రోజులు ఉంటే… 14 రోజులు కలిసి ఉండేందుకు అనుమతి ఉంటుంది.
* 45 కంటే తక్కువ రోజులపాటు సిరీస్ కొనసాగితే కేవలం 7 రోజులే ప్లేయర్లు తమ ఫ్యామిలీతో ఉండేందుకు అనుమతి ఉంటుంది.
* ఆటగాళ్లంతా టీం బస్సులో మాత్రమే ప్రయాణించాలి.
* ట్రావెల్ చేసేప్పుడు లగేజీ 150 కిలోల కంటే ఎక్కువ ఉంటే.. అదనంగా ఉన్న బరువుకు ప్లేయర్లే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
* హెడ్ కోచ్‌ గంబీర్ పర్సనల్ మెనేజర్‌కు టీమ్‌తో వసతి ఉండదు. టీమ్‌లో అతను ప్రయాణించవద్దు. స్టేడియంలో కూడా అన్ని ప్రాంతాలకు అతనికి యాక్సెస్ ఉండదు.

బీసీసీఐకి ఆటగాళ్లను చూసుకోవడం సులువే. కానీ వారి కుటుంబాలను మేనేజ్ చేయడం కాస్త కష్టంగా మారుతోంది. 2020లో ఆస్ట్రేలియా పర్యటనలో భారత ఆటగాళ్ల కుటుంబాలను మేనేజ్ చేసేందుకు బీసీసీఐ కష్టపడాల్సి వచ్చింది. ఆ టూర్‌లో టీమిండియా ఆటగాళ్లు, సహాయక సిబ్బందితో పాటు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఈ సంఖ్య 40 కంటే ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో వారికి రెండు బస్సుల కంటే ఎక్కువగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆటగాళ్ల కుటుంబాలకు మ్యాచ్ టిక్కెట్లను ఏర్పాటు చేయడం కూడా ఖర్చుతో కూడుకున్నది. 2019 ప్రపంచకప్ సమయంలో కూడా బీసీసీఐ అధికారులు ఈ సమస్యను ఎదుర్కొన్నారు. అందుకే ఇప్పుడు బీసీసీఐ నిబందనల్లో మార్పు తెచ్చింది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com