27.2 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

నితీష్‌… చంద్రబాబులకు మా గతే…

శివసేన యువనేత ఆదిత్య నాథ్ సంచలన ఆరోపణలు

బీజేపి వెన్ను పోటు రాజకీయాలకు ప్రసిద్ధి

రేపు బీహార్ ఎన్నికల్లో నితీష్‌ కు జరిగేదదే

మళ్లీ ఇండియా కూటమికి రాక తప్పదు

దేశంలో ప్రజాస్వామ్యం లేదు

ఓటేస్తే ఎటు పోతోందో తెలీదు…

ఈవీఎంలు హ్యాక్ చేసి ఢిల్లీ గెలిచారు…

ఇవాల్టి రోజు ఓటు వేస్తే అది ఎటుపోతుందో తెలీటం లేదు. దేశంలో ప్రజాస్వామ్యం లేదు. ఇవాళ కాంగ్రెస్ కి, కేజ్రీవాల్ కు జరిగిందే రేపు ఎన్డీఏ కూటమి మద్దతు దారులైన నితీష్, చంద్రబాబు నాయుడులకు కూడా జరగొచ్చు అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు శివసేన యువనేత ఆదిత్య థాకరే.2023లో ఇండియా కూటమి ఏర్పాటుకు నితీష్‌ కుమార్ ఆద్యుడు. ఏడాది తిరగకుండా ఆయన ఎన్డీఏ కూటమి లోకి జంప్ చేశారంటేనే బీజేపి రాజకీయాలు ఎలాంటివో అర్ధం చేసుకోవచ్చు ఈ ఏడాది బీహార్ కు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల తర్వాత నితీష్‌ మళ్లీ ఇండియా కూటమిలోకి రాక తప్పదు అని ఆదిత్య జోస్యం చెప్పారు. బీజేపి నితీష్‌కు వెంటే ఉండి వెన్ను పోటైనా పొడుస్తుంది… లేదంటే  మెజారిటీ తమకే సీట్లు దక్కేలా మానిప్యులేట్‌ చేస్తుంది. ఇది మాత్రం గ్యారంటీ అన్నారు ఆదిత్య.

కూటమి లుకలుకలు…

2023లో ఏర్పాటైన ఇండియా కూటమి ధ్యేయం బీజేపిని ఓడించాలని. బలమైన ప్రత్యామ్నాయంగా ఎదగాలని. మొదట్లో అక్కడక్కడ విజయాలు ఆశ కలిగించినా ఆ  తర్వాత ఈ కూటమి ఐక్యత సందేహంలో పడిపోయింది. కాంగ్రెస్ చిన్న పార్టీలను కలుపుకుపోయి రాజకీయాలు చేయలేక పోతోందని తేలిపోయింది. అనేక రాష్ట్రాల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటులో తేడాలే కూటమి ఐక్యతను దెబ్బ తీశాయని మిత్ర పక్షాలు చేసిన ఆరోపణలను కాంగ్రెస్ ఖండించింది. కూటమిలో ప్రతీ పార్టీని గెలిపించడం తమ డ్యూటీ కాదని కామెంట్‌ చేసింది. ఇండియా కూటమిలో నాయకత్వ బాధ్యతలు ఎవరు చేపట్టాలన్న దానిపై తర్జన భర్జనలు జరుగుతున్నాయి. అటు అఖిలేష్‌, ఇటు మమతా బెనర్జీ కూడా రాహుల్ తీరుపై బాహాటంగానే తిరగబడుతున్నారు.తమకు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే బ్రహ్మాండంగా నడుపుతామని అంటున్నారు.  ఇండియాకూటమిని నాయకత్వ వైరుధ్యాలు పట్టి పీడిస్తున్నాయన్న ఆరోపణలను ఆదిత్య నాథ్ థాకరే ఖండించారు. అలాంటిదేమీ లేదని అన్నీ సర్దుకుంటాయని అన్నారు. ఇప్పుడు ఆలోచించాల్సింది ఇండియా కూటమి మంచి చెడులు కాదు. దేశ భవిష్యత్తు అని అన్నారు. ఎవరేమంటున్న ఇండియా కూటమి ముందున్న అతిపెద్ద సవాల్‌ బీహార్ ఎన్నికలు. ఈ ఎన్నికల నాటికైనా ఇండియాకూటమి విభేదాలు పక్కన పెట్టి సంఘటితమవుతుందా అన్నప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

ఈవీఎంలు హ్యాక్ చేశారు… ఆదిత్య

ఢిల్లీ ఎన్నికల్లో బీజేపి గెలవడంతో ఈవీఎం లపై మళ్లీ విపక్షాలు సందేహాలు వ్యక్తం చేయడం మొదలైంది. తాజగా శివసేన ఈవీఎం ల మోసం వాదనలను మళ్లీ తెరపైకి తెచ్చింది. బీజేపి ఈవీఎంల ను హ్యాక్ చేసి ఢల్లీ ఎన్నికలు గెలిచిందని శివసేన యువనేత ఆదిత్యనాథ్ థాకరే ఆరోపించారు. ఇండియా కూటమికి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నా. శివసేన తాజా రాజకీయ సమీకరణల నేపధ్యంలో ఇండియా కూటమి వైపు మొగ్గు చూపుతోంది. నిన్న రాత్రి ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసిన ఆదిత్య నాథ్ ఇవాళ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ ను కలసుకున్నారు. మహారాష్ట్రలో శివసేన చీలిక వర్గం నేత, డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండేకు శరద్‌ పవార్ వర్గం మద్దతు పలుకుతుండటంపై మాట్లాడేందుకు ఆదిత్య నిరాకరించారు. శివసేనను నిలువునా చీల్చేసిన వ్యక్తి ఏక్ నాథ్ షిండే.. ఆయన చర్యలను మేమెలా సమర్ధిస్తాం అని ఎదురు ప్రశ్న వేశారు. బీజేపి కుటిలరాజకీయాలతో ఇండియా కూటమి బ్లాక్ ను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. ఈవీఎంలను హ్యాక్ చేసి ఢిల్లీ ఎన్నికలు గెలిచిందని ఆరోపించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com