23.6 C
Hyderabad
Saturday, October 31, 2026

Live Video

spot_img

బీఆర్‌ఎస్‌లో కొత్త పదవులు – డిసైడ్‌ చేసిన కేసీఆర్‌

బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ స్వరూపంలో మార్పులు చేసేందుకు సిద్ధమయినట్లు సమాచారం. మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా అడుగులు వేయకుంటే పార్టీ మటాష్ అవుతుందని భావించారట కేసీఆర్‌. ఇప్పుడు జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆ విధంగా అడుగులు వేసినట్టు కనిపిస్తోంది. అదే సమయంలో బీసీల అంశం పార్టీలో ఏ మాత్రం ప్రస్తావనకు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలో పాత అంశాలను ప్రస్తావించినట్టు కొందరు నేతలు చెబుతున్నారు.

నలుగురు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌లు? :

బీఆర్‌ఎస్‌ పార్టీలో ఇప్పటివరకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక్కరే ఉన్నారు. ఆ సంఖ్యను నాలుగుకు చేర్చాలని కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇప్పటివరకు కేటీఆర్ ఒక్కటే బీఆర్‌ఎస్‌ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. కేటీఆర్‌తో పాటు మరో ముగ్గురికి అవకాశం కల్పించనున్నా రట. వారిలో మహిళలకు ఎక్కువగా ఛాన్స్ ఇవ్వొచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఒకరు బీసీ, మరొకరు ఎస్సీ, ఇంకొకరు టాప్ కమ్యూనిటీకి చెందిన మహిళ ఉండనున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఇంతలా దిగజారి పోవటానికి మీరే కారణమని కొందరు సీనియర్లు తప్పుబట్టారని తెలుస్తోంది. తొలుత ఇంటి సమస్యలు సరిదిద్దుకుంటే, ప్రత్యర్థులకు ధీటుగా బదులు ఇవ్వవచ్చని చెప్పినట్టు సమాచారం. ఒకానొక దశలో యువనేతపై కేసీఆర్ కాసింత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంటిని చక్కదిద్దుకునే పనిలో భాగంగా హాజరైన నేతల నుంచి అభిప్రాయసేకరణ చేశారు కేసీఆర్‌. పార్టీ శ్రేణుల అంచనాలకు అనుగుణంగా బహిరంగ సభ నిర్వహణకు ప్లాన్‌ చేశారట. ఇందులో భాగంగానే కొన్ని కమిటీలకు ఇం‌ఛార్జ్‌గా హరీష్‌రావుకు బాధ్యతలు అప్పగించారు కేసీఆర్. ఆ విషయాన్ని కేటీఆర్‌ మీడియా సమావేశంలో వెల్లడించారు.

మహిళా విభాగం అధ్యక్షురాలిగా కవిత :

గత ఎన్నికల్లో మహిళలు బీఆర్ఎస్‌ను చావదెబ్బ కొట్టారని కేసీఆర్‌కు పలు నివేదికలు అందాయి. ఈ నేపథ్యంలో పార్టీలో మహిళలకు ఇప్పటికైనా పెద్ద పీట వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే పార్టీలో ప్రత్యేకంగా మహిళా విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బీఆర్‌ఎస్‌ మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా కవితను నియమించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com