టాలీవుడ్ స్టార్ నాగచైతన్య, శోభిత దంపతులకు ఇద్దరు పిల్లలు పుడతారట. అయితే.. ఇప్పుడే కాదు లెండి. మరో 14 నెలల తర్వాత.. అంటే వచ్చే యేడాది ప్లాన్ చేసుకుంటారట. ప్రస్తుతం వాళ్ల వాళ్ల బాధ్యతల్లో ఇద్దరూ బిజీగా ఉన్నారని, వచ్చే యేడాది పిల్లల కోసం ప్లాన్ చేసుకుంటారని టారట్ కార్డ్ రీడర్ స్పెషలిస్ట్ అన్మోల్ చెప్పారు. పొలిటెంట్ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అన్మోల్ ఈ వివరాలు వెల్లడించారు. నాగ చైతన్య, శోభిత దంపతులకు పిల్లలు పుడతారా? ఎంత మంది పుడతారు? అని అడిగిన ప్రశ్నకు.. తనదైన టారట్ కార్డ్‌ల ద్వారా జాతకం చూసి అన్మోల్ ఈ విషయాన్ని చెప్పారు.