27.3 C
Hyderabad
Friday, June 5, 2026

Live Video

spot_img

మయన్మార్ రెస్క్యూ అప్‌డేట్స్.. ఏ దేశం ఏం చేసింది?

గడచిన వందేళ్లలో ఎప్పుడూ చూడని ఉపద్రవాన్ని చూసింది మయన్మార్. 7.7, 5.1 తీవ్రతతో భూమి కంపించడంతో ఆ దేశం ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఎక్కడ చూసిన శిథిలాలు వాటికింద చిక్కకున్న ప్రజలు కనిపిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న కొద్ది మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం మృతుల సంఖ్య 1700కు చేరువలో ఉంది. ఆచూకి కనిపించని వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 4వేలకు చేరువలో ఉంది.

సర్వం కోల్పోయిన మయన్మార్‌కు ప్రపంచ దేశాలు ఆపన్నహస్తం అందిస్తున్నాయి. ఇప్పటికే భారత్, రష్యా, చైనా తమ రెస్క్యూ టీమ్స్‌ను మయన్మార్‌కు పంపాయి. భారత్ నుంచి ఇప్పటికే ఐదు యుద్ధ విమానాల్లో సహాయ సామాగ్రితో పాటు.. రెస్క్యూ టీమ్స్‌ను భారత్‌ పంపింది. ఇప్పటకే రెండు యుద్ధ నౌకలు మయన్మార్‌ రాజధానికి చేరుకోగా.. మరో రెండు నేవీ షిప్స్ రేపు చేరుకోనున్నాయి.

ఇక రష్యా కూడా మయన్మార్‌కు అండగా నిలిచింది. రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొనేందుకు చాలా మంది సిబ్బందితో పాటు.. అత్యాధునిక సదుపాయాలను పంపించింది. చైనా కూడా రెస్క్యూ టీమ్స్‌తో పాటు డ్రోన్స్, ఎమర్జెన్సీ ఎక్విప్‌మెంట్‌ను పంపింది. ఇక 5.1 తీవ్రతతో వచ్చిన ఆఫ్టర్‌ షాక్స్ మరోసారి మయన్మార్ ప్రజలను ఇబ్బందులో పడేసింది. ఈ ప్రకంపనల దెబ్బకు రెస్క్యూ ఆపరేషన్స్‌లో పాల్గొంటున్న 12 మంది చైనా సిబ్బంది గాయపడ్డారు.

ఓ వైపు ఎక్కడ చూసిన శిథిలాలు.. తిండిలేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు కనిపిస్తుంటే.. రెబల్స్‌పై మాత్రం దాడులు ఆపడం లేదు అక్కడి జుంటా. తాజాగా కొన్ని ప్రాంతాల్లో ఏరియల్ స్ట్రైక్స్ నిర్వహించింది. దీంతో అక్కడి మిలటరీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మరోవైపు రెబల్స్ తమ పట్టున్న ప్రాంతాల్లో రెస్క్యూ కోసం ఏనుగులను ఉపయోగిస్తున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com