36.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

ముంబై మ్యాజిక్.. రాజస్థాన్‌ రేస్ నుంచి ఔట్..

ముంబై ఇండియన్స్.. ఓ అద్భుతం చేసింది. వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో గెలిచి తన సత్తా ఏంటో చాటింది. ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్‌తో రాజస్థాన్‌ రాయల్స్‌ను చిత్తు చేసి పాయింట్స్‌ టేబుల్‌లో టాప్‌ ప్లేస్‌కు చేరుకుంది. దీంతో MI టాప్‌ ప్లేస్‌కి చేరుకోగా.. RRకి ప్లే ఆఫ్‌ రేస్‌ నుంచి తప్పుకుంది. దీంతో CSK తర్వాత ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకున్న రెండో టీమ్‌గా నిలిచింది RR.

తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్ ప్లేయర్స్‌ తేలిపోయారు. మొదట బ్యాటింగ్ చేసిన MI.. పరుగుల వరద పారించారు. రోహిత్ శర్మ, రికెట్లన్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా కూడా పరుగుల వరద పారించారు. ఇద్దరు 23 బాల్స్‌ ఆడి 48 పరుగులు చేశారు. దీంతో ముంబై ఏకంగా 217 పరుగుల భారీ స్కోర్ చేసింది.

నిజానికి RR ఆడిన లాస్ట్‌ మ్యాచ్‌ను చూస్తే ఇదేం పెద్ద రికార్డ్ కాదనే చెప్పాలి. ఎందుకంటే GT విధించిన 203 పరుగుల టార్గెట్‌ను ఆడుతూ పాడుతూ చేజ్ చేసింది రాయల్స్ టీమ్. కానీ ముంబైపై ఆ పాచికలు పారలేదు. లాస్ట్ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన వైభవ్ సూర్యవంశీని డకౌట్ చేశాడు చాహర్. ఇక జైశ్వాల్ కూడా 13 పరుగులకే పెవిలియన్ చేరాడు. దీంతో వారి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఎవ్వరూ కూడా ఆశించిన తీరులో ఆడలేదు. దీంతో 16.1 ఓవర్లలోనే 117 పరుగులకే రాజస్థాన్ ఆలౌట్ అయ్యింది.

ఈ మ్యాచ్‌లో ముంబై ఏకంగా 100 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో పాయింట్స్‌ టేబుల్‌లో టాప్‌ ప్లేస్‌లోకి చేరడమే కాదు.. నెట్‌ రన్‌రేట్‌ను కూడా మెరుగుపరుచుకుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com