33.2 C
Hyderabad
Saturday, April 18, 2026

Live Video

spot_img

బన్నీతో మోనాలీసా

  • సోషల్‌ మీడియాలో మోనాలీసా హల్ చల్
  • సినిమాల్లోకి రావాలని ఇండోర్ సెన్సేషన్ కోరిక
  • ట్రెండింగ్‌ లో నిలవాలని కొత్త పుంతలు
  • పుష్ప-2 మూవీ పోస్టర్ తో పోజు..
  • ఇంటర్నెట్‌ లో మొదలైన చర్చ
  • ఇంకా పట్టాలెక్కని తొలి మూవీ కాంట్రాక్టు

కొంత మందికి కొన్ని విశేష ఘడియల్లో అవకాశాలు తన్నుకుంటూ వస్తాయ్. మహా కుంభమేళా ఫేమ్‌ మోనాలీసా కి కూడా అంతే. కుంభమేళాలో తన రూప, లావణ్యాలతో సోషల్‌ మీడియా సెన్సేషన్ గా మారిన ఇండోర్ కు చెందిన ఓ పూసలమ్ముకునే పల్లెటూరి పిల్ల సోషల్‌ మీడియా పుణ్యమాని ఇప్పుడు హీరోయిన్ మెటీరియల్ అయి కూర్చుంది. కుంభమేళాలో ఆమె అందచందాలను తమ వీడియోల్లో బంధించిన ఔత్సాహికులు ఆమెను ఇంటర్నెట్‌ సెన్సేషన్ గా మార్చేశారు. కాటుక పెట్టిన తేనె కళ్లు, డస్కీ స్కిన్, అందమైన ముఖ సౌందర్యం ఒంటినిండా పూసలతో పక్కా పల్లెటూరి పిల్లలా ఉండే ఈ అందమైన యువతి కి కుర్రకారు ఫిదా అయిపోయారు. ఇంకేముందీ ఆమెను ఏకంగా ఇంటర్వ్యూ పేరుతో చుట్టుముట్టి తమ ఛానెళ్లకు మైలేజీ తెచ్చుకునే పనిలో పడ్డారు. మొదట సరదాగా మారిన ఈ వ్యవహారం రష్‌ పెరగడంతో ఆమె భద్రతకూ ఇబ్బందులు తెచ్చిపెట్టింది. చేసుకుంటున్న పూసల వ్యాపారం కాస్తా చంకనెక్కింది. పరిస్థితి గమనించిన ఆమె తండ్రి ఆ కన్నెపిల్లను ఇంటికి పంపేశాడు. ఈలోగా ఈ బ్యూటీ అందచందాలు విశ్వ వ్యాప్తమైపోయి బాలీవుడ్ ను తాకాయి. డైరక్టర్ సరోజ్ వినేరా ఏకంగా ఆమెతో ఓ మూవీనే సైన్ చేశారు. ఇండోర్ లో స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి మరీ ఆమెను ఒప్పించి సంతకాలు తీసుకున్నారు.

మోనాలీసా భోంస్లే ఇలా ఒప్పందంపై సైన్ చేసిందో లేదో ఆమె క్రేజ్ మళ్లీ అందరి దృష్టిలో పడింది. దీంతో సహజంగానే ఆమెకూ సినిమాల్లోకి ఎంటరవ్వాలనే తహతహ పెరిగింది.తన మార్కెటింగ్‌ స్ట్రాటజీకి పదును పెట్టింది.ఈసారి ఏకంగా బన్నీనే టార్గెట్‌ చేసింది. ఇప్పటికే బ్రహ్మాండమైన సక్సెస్ సాధించిన పుష్ప -2 మూవీ పోస్టర్ ముందు నిలబడి ఓ ఫోటో దిగి దానిని తన సోషల్‌ మీడియా ఎక్కౌంట్‌ లో షేర్ చేసింది. దానికో అందమైన క్యాప్షన్ కూడా రాసి పారేసింది. ఇవాళ నేను పోస్టర్ బయట ఉండొచ్చు. రేపు నేను పోస్టర్ మీదుంటా. ఇప్పుడు నా టైమ్ వచ్చింది. త్వరలోనే ముంబైలో కలుద్దాం.. అల్లూ అర్జున్ పుష్పా-2 అని రాసుకొచ్చింది.

మోనాలీసా రియాక్షన్ చూసిన నెటిజన్లు ట్రెండింగ్‌ లో ఉన్న పుష్ప-2 మూవీని తన ప్రచారానికి వాడుకుంటోంది. అందరి దృష్టిలో పడేందుకు ట్రై చేస్తోందంటూ కామెంట్‌ చేస్తున్నారు. మొత్తం మీద పూసలమ్ముకునే అమ్మాయి బాలీవుడ్ స్క్రీన్ మీద తళుక్కు మనేందుకు ప్రయత్నిస్తోంది.ఆమెతో సినిమా తీయాలన్నబాలీవుడ్‌ డైరక్టర్ కల నిజంగా మారుతుందో లేదో గానీ.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com