బుధవారం ఉదయం 10.30 గంటలకు తన ముందు హజరు కావాలని రాచకొండ సీపీ ఇచ్చిన నోటీసును సవాల్ చేస్తూ సినీ నటుడు మోహనబాబు హైకోర్టులో లంచ్ మోహషన్ పిటీషన్ దాఖలు చేశారు. జల్ పల్లిలో నిన్ని రాత్రి మోహన్ బాబు ఇంటి వద్ద తలెత్తిన ఉద్రికత్తలు, మీడియాపై దాడి నేపథ్యంలో రాచకొండ పోలీసులు తమ ముందు హాజరుకావాలని మోహన్ బాబుకు నోటీసులు జారీ చేశారు. అయితే పోలీసుల నోటీసుపై బుధవారం మోహనబాబు తరపున సీనియర్ న్యాయవాదులు నగేష్ రెడ్డి, మురళీ మనోహర్లు హైకోర్టులో లంచ్ మోహషన మూవ్ చేశారు. పోలీసులు ఇచ్చిన నోటీసులను రద్ద చేయడమే కాకుండా తన ఇంటి వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని మోహన్ బాబు హైకోర్టుకు సమర్పించిన పిటీషన్ లో కోరారు. తనకు ప్రాణహాని ఉందని భద్రత కల్పించాలని పోలీసులను కోరినా ఇంతవరకూ తనకు భద్రత కల్పించలేదని హైకోర్టుకు సమర్పించిన పిటీషన్లో పేర్కొన్నారు.