28 C
Hyderabad
Tuesday, March 10, 2026

Live Video

spot_img

చేనేతపై జీఎస్టీ మోడీ ప్రభుత్వ దౌర్భాగ్యం – ఎమ్మెల్సీ కవిత

బ్రిటీష్ పాలనలో కూడా లేని చేనేతపై పన్నును ప్రధాని మోదీ జీఎస్టీని విధించడం దౌర్భాగ్యమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.

సోమవారం అఖిల భారత పద్మశాలి సంఘం నాయకులు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత తన నివాసంలో కలిశారు. కులగణనపై బీసీ డెడికేటెడ్ కమిషన్ కు నివేదిక అందించినందుకు ఎమ్మెల్సీ కవితకు ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వ తరఫున చేనేతపై జీఎస్టీని రీయింబర్స్ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక హామీని విస్మరించడం శోచనీయమని విమర్శించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చేనేతపై కేంద్రం విధిస్తున్న జీఎస్టీని రియింబర్స్ చేయాలని డిమాండ్ చేశారు.

అఖిల భారత పద్మశాలి సంఘ జాతీయ అధ్యక్షులు కందగట్ల స్వామి, అఖిలభారత పద్మశాలి సంఘం రాజకీయ జాతీయ అధ్యక్షుడు బొల్లా శివశంకర్, తెలంగాణ పద్మశాలి సంఘ మహిళా అధ్యక్షురాలు గుంటక రూపక, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు గుర్రం శ్రవణ్, తెలంగాణ పద్మశాన సంఘ రాజకీయ విబాగా ప్రధాన కార్యదర్శి కు బొమ్మ ప్రవళిక, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జిల్లా నరేందర్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు చిట్టిపోలు గణేష్, రాష్ట్ర పద్మశాలి సంఘం యూత్ అధ్యక్షులు అంబటి శ్రీనివాస్ మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com