25.6 C
Hyderabad
Sunday, June 28, 2026

Live Video

spot_img

ఆర్సెలార్ మిట్టల్‌కు ముడి ఇనుము..మంత్రి టీజీ భరత్

కేంద్ర భారీ పరిశ్రమలు & ఉక్కు శాఖ మంత్రి హెచ్‌.డీ కుమార స్వామి, ఉక్కు శాఖ కార్యదర్శితో ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ సమావేశం అయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో ఆర్సెలార్ మిట్టల్‌కు ఐరన్ ఖనిజం సరఫరాపై చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి ఎంతో సానుకూలంగా స్పందించినట్టు మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ ఒప్పందం సులభతరం చేయడంలో సహకరించినందుకు కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమార్ స్వామికి.. భరత్ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వానికి, దార్శనికతకు ఈ ప్రగతి నిదర్శనమని అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత పెరిగేలా కృషి చేస్తామని టీజీ భరత్ చెప్పారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com