మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరుడికి ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. శివరాత్రి పర్వదినం నాడు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, శ్రీకాళహస్తి శాసనసభ్యుడు బొజ్జల సుధీర్ రెడ్డిలు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. దేవాలయ ప్రాంగాణానికి చేరుకున్న మంత్రి ఆనంకు దేవాలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి ప్రభుత్వం తరపున శ్రీకాళహస్తీశ్వరుడికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా శివభక్తులకు శ్రీకాళహస్తి క్షేత్రం ఆధ్యాత్మికంగా కీలక కేంద్రంగా ఉందని చెప్పారు. మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి దర్శనార్థం లక్షలాది మంది భక్తులు శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకోవడం, రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంది అని, భక్తులు మనోభావాలకు కాపాడటానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడు పెద్దపీట వేస్తుందని మంత్రి తెలిపారు. మహా శివరాత్రి పర్వదినం కావడం తో భక్తులు రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండటం తో ఏర్పాట్లు అదనంగా ఉండేలా చొరవ తీసుకోవాలని మంత్రి అధికారులుకు ఆదేశాలు జారీ చేశారు. క్యూ లైన్ విషయం లో, ప్రత్యేక దర్శనం విషయం లో, వసతి సదుపాయాలు, పారిశుధ్య పనులు ఎప్పటికి అప్పుడు పర్యవేక్షణ చేయాలనీ అలాగే విధి నిర్వహణ కోసం వచ్చిన అధికారులు కూడా ఒకరి ఒకరు సహకరించుకుంటూ శాఖల మధ్య సమన్వయం తో కలిసి కట్టుగా పని చేసి ఏ ఒక్క భక్తుడు కూడా ఇబ్బంది లేకుండా చూడాలని మంత్రి తెలిపారు.
- Advertisement with us -