మిల్కీ బ్యూటీ తమన్నా స్టేటస్ మళ్లీ సింగిల్‌గా మారినట్టు తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మతో ప్రేమాయణం నడిపిన ఈ బ్యూటీ .. ప్రస్తుతం మళ్లీ ఒంటరిగానే మిగిలిపోయినట్టు టాక్ వినిపిస్తోంది. కొద్దికాలం ముందు వరకు తమన్నా, విజయ్ వర్మ చెట్టా పట్టాలెసుకొని తిరిగారు. కలిసి రెస్టారెంట్లకు వెళ్లడం.. సినిమా ఫంక్షన్లకు అటెండ్ అవ్వడం.. కలిసి ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వడం.. ఇలా అన్ని విషయాలు కలిసే చేసిన ఈ జంట.. ప్రస్తుతం కలిసి లేరని తెలుస్తోంది. అయితే విడిపోయినా మంచి స్నేహితులుగానే ఉంటారని చెబుతున్నారు వీరిద్దరికి తెలిసిన సన్నిహిత వర్గాలు.
2023 నుంచి వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారు. లస్ట్ సిరీస్ 2 షూట్‌లో ఒకటైన ఈ జంట.. అప్పటి నుంచి చెట్టపట్టాలు వేసుకొని తిరిగారు. చాలా ఇంటర్వ్యూలలో వీరిద్దరి మధ్య ప్రేమను కూడా ఎక్స్‌ప్రెస్ చేశారు. ఇక రేపో మాపో పెళ్లి కూడా చేసుకుంటారన్న ప్రచారం జరిగింది. కానీ ఇంతలోనే బ్రేకప్ వార్తలు రావడం మిల్క్ బ్యూటీ ఫ్యాన్స్‌ను హర్ట్ చేసిందనే చెప్పాలి. అయితే ఈ బ్రేకప్ వార్తలను వీరిద్దరు అఫిషియల్‌గా మాత్రం అనౌన్స్ చేయలేదు.