హైదరాబాద్ మణికొండలోని నార్సింగి మార్కెట్ సబ్ స్టేషన్‌లో 33kv లైన్ పనులు జరుగుతున్న కారణంగా ఈనెల 6వ తేదీ సోమవారం నాడు సబ్ స్టేషన్ పరిధిలోని పలు ఫీడర్‌లలో విద్యుత్ సరఫరా నిలిపేస్తామని ఇబ్రహీంబాగ్ ఏఈ సంతోష్‌కుమార్ తెలిపారు. నార్సింగి మార్కెట్ ఏరియాలోని ఫీడర్, తుల్జారం ఫీడర్ అల్కాపూర్ ఫీడర్‌లలో విద్యుత్ సరఫరా నిలిపేయడం జరుగుతుందని ఏఈ వివరించారు. రాత్రి పదకొండు గంటల నుంచి తెల్లవారు జామున రెండు గంటల దాకా కరెంటు సరఫరా నిలిపేయాల్సి వస్తుందన్నారు. 33కేవీ కొత్త లైన్, మరమ్మత్తు పనుల్లో భాగంగా కరెంటు సరఫరా నిలిపేస్తున్నట్లు వివరించారు. ఈ కారణంగా నార్సింగ్ మార్కెట్ ఏరియా ఫీడర్ పరిధిలోని యూత్ కాలనీ, తిరుమల హిల్స్, కిజ్రా కాలనీ, డాలర్ హిల్స్ కాలనీల్లో కరెంటు సరఫరా ఉండదన్నారు.
అలాగే, తుల్జారం ఫీడర్ పరిధిలోని అల్కాపురి రోడ్ నంబర్ 23 నుండి 25 వరకు , గోగ్రీన్, నయా గంగోత్రి, నక్షత్ర అపార్ట్‌మెంట్లకు, తుల్జారామ్ టెంపుల్ బ్యాక్ సైడ్ రోడ్ నంబర్ 26 నుండి 30 వరకు, అలాగే, ఫ్లోరా గేటెడ్ కమ్యూనిటీ , హఫీజ్ కాలనీ ప్రాంతాల్లో కూడా సోమవారం రాత్రి 11 గంటల నుంచి కరెంటు సరఫరా ఆపేస్తామన్నారు. అదేవిధంగా కొత్త అల్కాపూర్ ఫీడర్ పరిధిలోని అల్కాపురి రోడ్ నంబర్ 13 నుండి 22 వరకు, అలాగే, సెక్టార్ 4 పరిధిలోని రోడ్ నంబర్ 25, మహాత్మా గాంధీ పార్క్ ప్రాంతాల్లో సోమవారం రాత్రి 11 గంటల నుంచి తెల్లవారు జామున 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నామని ఏఈ సంతోష్‌కుమార్ పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లోని కరెంటు వినియోగదారులు అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
రేపు అర్థరాత్రి మణికొండ ప్రాంతంలో కరెంటు బంద్
- Advertisement with us -