భూ భారతి 2024 ఆర్ ఓ ఆర్ చట్టానికి శాసనసభ ఈ రోజు ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి రానుంది. ఇప్పటి వరకు ఉన్న ధరణి స్థానంలో… ఇకపై భూ భారతి రానుంది. కెసిఆర్ హయంలో తీసుకొచ్చిన ధరణి చట్టంలో లొసుగులను సరిదిద్దుతూ కొత్త చట్టాన్ని తీసుకొచ్చామని ప్రభుత్వం ప్రకటించింది. ధరణిపై అనేక ఆరోపణలు వచ్చాయని వాటిని సరిదిద్ది ప్రజలకు మేలు చేసేందుకు కొత్త చట్టం ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. రెవెన్యూ రికార్డులు టాంపరింగ్ జరగకుండా కంప్యూటర్ రికార్డులతో పాటు నిర్ణీత కాల వ్యవధిలో మాన్యువల్ కాపీని కూడా రెవెన్యూ కార్యాలయాలలో భద్రపరుస్తామని రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
భూభారతి చట్టం ముఖ్యాంశాలు
భూ-భారతి ప్రత్యేకతలు
• ఆరు మాడ్యూళ్ళు : ఆనాటి ధరణిలో 33 మాడ్యూళ్లు (ఆప్షన్స్) ఉండేవి. ఇప్పుడు దాన్ని ఆరు మాడ్యూళ్ళకు కుదించారు.
• 11 కాలమ్‌లు : గతంలో మాన్యువల్‌గా పహాణీలో 32 కాలమ్‌లు ఉండేవి. వాటిని ధరణిలో ఒకే కాలమ్‌కు గత ప్రభుత్వం కుదించింది. ఇప్పుడు దాన్ని 11 కాలమ్‌లు చేస్తున్నారు.
• డిస్‌ప్లే : గత ప్రభుత్వం కొన్ని వివరాలను బహిర్గతం కాకుండా లాకర్లలో బంధించింది. ఇప్పుడు భూ-భారతితో ఎవరైనా ఎక్కడి నుంచైనా చూసుకునే అవకాశం ఉంది.
• ప్రభుత్వ భూములు అన్యాక్రాంతానికి గురికాకుండా ఎవరైనా భూ భారతి ద్వారా ప్రభుత్వానికి తెలియ చేయవచ్చు. ఆ భూముల్ని పరిరక్షించేలా చట్టం ఉంటుంది.
• భూ-భారతిలో దరఖాస్తు చేసుకున్న భూములున్న ఆసాములకు వారి మొబైల్ నెంబర్లకే అప్‌డేట్స్ వెళ్ళే సౌకర్యం ఉంటుంది.
• గతంలో ధరణి కారణంగా అన్యాక్రాంతమైన భూముల వివరాలు భూ భారతి ద్వారా సొంతదారులకు అప్పగించవచ్చు.
• 2014కు ముందు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల దగ్గర ఉన్న ప్రభుత్వ భూముల జాబితాలోని రెవెన్యూ, ఎండోమెంట్, వక్ఫ్, భూదాన్, ఫారెస్ట్ తదితర భూముల వివరాలను ధరణిలోని డేటాతో పోల్చి చూసి అన్యాక్రాంతమైన భూముల వివరాలను బహిర్గతం చేస్తారు.
======
• మూడు నెలల్లోనే రూల్స్ ఫ్రేమ్ : గత ప్రభుత్వం ధరణి తెచ్చిన తర్వాత మూడేండ్లు దాటినా రూల్స్ ఫ్రేమ్ చేయకపోవడంతో తప్పులు జరిగాయి. ఆ తప్పుల్ని ప్రజలపై బలవంతంగా రుద్దింది. ఇప్పుడు అలా జరగకుండా మూడు నెలల్లోనే రూల్స్ ఫ్రేమ్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
• గ్రామ స్థాయిలో రెవెన్యూ సదస్సులు : రూల్స్ ఫ్రేమ్ అయిన తర్వాత గ్రామ స్థాయిలో రెవెన్యూ సదస్సులు పెట్టి అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులతో కలిసి పరిష్కారాన్ని యుద్ధ ప్రాతిపదికన చర్యలు
• త్వరలో ఒకే చట్టం : ఇందిరమ్మ ప్రభుత్వం అన్ని చట్టాలను కలిపి ఒకే చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది.