23.8 C
Hyderabad
Wednesday, July 29, 2026

Live Video

spot_img

కేటీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురు…

క్వాష్‌ పిటీషన్ తిరస్కరించిన న్యాయస్ధానం

తనపై పెట్టిన ఫార్ములా ఈ కారు రేసు కేసు కొట్టివేయాలని బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిండెట్‌ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్‌ పిటీషన్ని మంగళవారం కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో కేటీఆర్‌ని ఏ1గా, అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అర్వింద్ కుమార్‌ని ఏ2గా, హుడా చీఫ్‌ ఇంజనీర్ బీఎల్‌ఎన్‌రెడ్డిని ఏ3గా పేర్కొంటూ తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసిన సందగతి తెలిసిందే. అయితే ఈ కేసు కొట్టివేయాలని కేటీఆర్ హైకోర్టులో క్వాష్‌ పిటీషన్ దాఖలు చేశారు. ఆ సందర్భంగా ఈ పిటీషన్‌పై తుది తీర్పు వెల్లడించేంత వరకూ కేటీఆర్‌ని అరెస్ట్‌ చెయ్యద్దని కోర్టు ఆదేశించింది. అయితే విచారణ కొనసాగించవచ్చని సూచించింది. దీంతో విచారణకు హాజరుకమ్మని ఏసీబీ కేటీఆర్‌కి నోటీసులు జారీ చేసింది. సోమవారం తన న్యాయవాదులతో బంజారాహిల్స్‌ ఏసీబీ కార్యాలయానికి వెళ్ళిన కేటీఆర్‌ని ఒంటరిగా విచారణకు హాజరుకావాలని ఏసీబీ అధికారులు కోరారు. తనకున్న రాజ్యాంగపరమైన హక్కులతో తాను న్యాయవాదులతో మాత్రమే విచారణకు హాజరవుతానని మీరు అనుమతించకపోతే ఇటునుంచి ఇటే వెళ్లిపోతానని ఏసీబీకి తేల్చి చెప్పారు. న్యాయవాదులతో విచారణకు అనుమతించే ప్రశక్తే లేదని ఏసీబీ కూడా స్పష్ట చెయ్యడంతో తన సమాధానాలను లేఖ ద్వరా ఏసీబీ అధికారులకు సమర్పించే కార్యాయలం బయట నుంచే కేటీఆర్‌ వెనుతిరిగారు. కాగా మంగళవారం కేటీఆర్‌ క్వాష్‌ పిటీషన్ని విచారణకు తీసుకున్న కోర్టు పిటీషన్ని తిరస్కరించింది. దీంతో కేటీఆర్‌ని ఎప్పుడైనా అరెస్ట్‌ చేయచ్చనే ప్రచారం రాజకీయవర్గాల్లో ఊపందుకుంది. ఇదిలా ఉండగా 9వ తేదీన గురువారం మరోసారి విచారణకు హాజరు కావాలని కేటీఆర్‌కు ఏసీబీ రెండో సారి నోటీసులు జారీ చేసింది. కోర్టు కేటీఆర్‌ క్వాష్‌ పిటీషన్ కొట్టివేసిన నేపథ్యంలో 9వ తారీకు ఏసీబీ విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com