కెనడాలో కొత్త ప్రభుత్వం కొలువు దీరాక ఖలిస్థానీ వేర్పాటువాదులు మరింత రెచ్చిపోతున్నారు. టొరంటోలో హిందూ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. కెనడాలోని హిందువులను బహిష్కరించి, భారత్‌కు తిప్పి పంపాలని ఖలిస్థానీ మద్దతుదారులు డిమాండ్ చేశారు. టొరంటోలోని మాల్టన్ గురుద్వారాలో మే నాలుగో తేదీన ఈ ఘటన జరిగింది.వేలాది మంది ఖలిస్థానీ వేర్పాటువాదులు హిందూ వ్యతిరేక ర్యాలీలో పాల్గొన్నారు.
కెనడాలో నివసిస్తున్న ఎనిమిది లక్షల మంది హిందువులను దేశం నుంచి బహిష్కరించాలని, వారిని భారత్‌కు వెళ్లగొట్టాలని ఖలిస్థానీ మద్దతుదారులు డిమాండ్ చేశారు. హిందు మతం, భారత దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ దిష్టిబొమ్మలు జైలులో ఉన్న నమూనాతో కూడిన వాహనాన్ని ర్యాలీలో ప్రదర్శించారు.
కెనడాలోని హిందూ సమాజం సిక్కుల ర్యాలీని ఖండించింది. ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థ హిందూ వ్యతిరేక ద్వేషాన్ని ప్రేరేపిస్తోందని ఆరోపించారు.
ఖలిస్థాన్ అనుకూల రాతలతో సిక్కు గురుద్వారా, హిందూ దేవాలయాల వద్ద అలజడి సృష్టిస్తున్న ఖలిస్థానీలు భారత్ వ్యతిరేకత ఎగదోస్తున్నారు. పాకిస్థాన్ నుంచి వలస వచ్చిన సిక్కులు కెనడాలో అధికంగా అల్లర్లలో పాల్గొంటున్నారు. పాకిస్తాన్ వెన్నుదన్నుతో వీరు చెలరేగుతున్నారు. సిక్కు పుణ్యక్షేత్రాల దర్శనం కోసం పాకిస్థాన్ వెళ్లి భారత సిక్కులకు ఖలిస్థాన్ అవశ్యకతపై బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. తాజాగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఏర్పడి అన్ని రకాల ఆంక్షలు విధించినా…ఇండియా సిక్కులకు మాత్రం పాకిస్థాన్ ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు.
https://x.com/TheophanesRex/status/1919185866230047164