23 C
Hyderabad
Monday, November 2, 2026

Live Video

spot_img

కాళేశ్వరం కమిషన్‌ నివేదిక వేళ.. కేసీఆర్‌ ఆమెరికా టూర్‌

బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమెరికా వెళ్లనున్నారు. ఈ మేరకు ఆయన కొద్దినెలల ముందు నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారట. ఈ క్రమంలోనే కేసీఆర్‌.. బుధవారం పార్టీ విస్తృత స్థాయి సమావేశం కోసం ఎర్రవల్లి ఫామ్‌ హౌజ్‌ నుంచి నేరుగా బీఆర్‌ఎస్‌ పార్టీ ఆఫీసుకు వెళ్లకుండా.. పాస్‌పోర్ట్‌ కార్యాలయానికి వెళ్లారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు మంజూరైన డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్‌ను అప్పగించారు. ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయి యేడాది దాటిన కారణంగా డిప్లొమాటిక్‌ పాస్‌పోర్ట్‌ స్థానంలో సాధారణ పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకున్నారు.

ఇక, ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ సాగిస్తోన్న జ్యుడిషియల్‌ కమిషన్‌ నివేదిక తుది దశకు చేరింది. రేపో, మాపో ఆ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి చేరనుంది. ఈ సమయంలోనే కేసీఆర్‌ అమెరికా పర్యటనకు ప్లాన్‌ చేసుకోవడంతో అనుమానాలు మొదలయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ అక్రమాలకు సంబంధించి కేసీఆరే ప్రధాన కారకుడిగా కమిషన్‌ గుర్తించినట్లు సమాచారం. ఈ వివరాలను క్రోడీకరిస్తూ రేవంత్‌ సర్కారుకు నివేదిక సమర్పించేందుకు కమిషన్‌ సిద్ధమయ్యింది. కేసీఆర్‌ మాత్రం ఆ లోపే అమెరికా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే రెండు నెలల నుంచే కేసీఆర్‌ తెరవెనుక ఏర్పాట్లు చేసుకుంటున్నారని సమాచారం. అందుకే బుధవారం పాస్‌పోర్ట్‌ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చిందంటున్నారు. మొత్తానికి కేసీఆర్‌ అమెరికా టూర్‌ మాత్రం పక్కా అంటున్నారు ఆయన సన్నిహితులు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com