జవహర్ లాల్ నెహ్రు హౌసింగ్ సొసైటీ(JNJ)లో రెండు డైరెక్టర్ల పోస్టులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో రెండు ప్యానెళ్లు పోటీ చేస్తున్నాయి. ఫ్రెండ్స్ ప్యానెల్ నుంచి డెక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్ వంశీ శ్రీనివాస్, భాస్కర్ న్యూస్ ఎండి నేమాన్ భాస్కర్ బరిలో ఉన్నారు.
మరో ప్యానెల్ టీమ్ JNJ నుంచి తాతా శ్రీనివాస్ రావు, బోడపాటి శ్రీనివాస రావులు పోటీ చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా కొత్తపల్లి రమేష్ పోటీ చేస్తున్నారు. ఆదివారం నామినేషన్లు దాఖలు కాగా ఈ రోజు అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు.
ఫ్రెండ్స్ ప్యానెల్ అభ్యర్థులు వంశీ శ్రీనివస్ కు బకెట్ గుర్తు రాగా నేమాని భాస్కర్ కు బ్యాట్ గుర్తు కేటాయించారు.
టీమ్ JNJ అభ్యర్థులు తాతా శ్రీనివాస్ కు టార్చి లైట్ రాగా, బోడపాటి శ్రీనివాస్ కు బ్రష్ గుర్తు దక్కింది. స్వతంత్ర అభ్యర్థికి అల్మారా గుర్తు కేటాయించారు.
ఈ నెల 23వ తేదీన పోలింగ్ జరుగనుండగా అభ్యర్థులు పోటీ పోటాగా ప్రచారం నిర్వహిస్తున్నారు. రెండు డైరెక్టర్ల పోస్టలకు జరుగుతున్న ఎన్నికలతో పోటీ రసవత్తరంగా మారింది.