సంచలన విషయాలకి మాజీ క్రికెటర్లు కొందరు తెరతీస్తున్నారు. అలా తాజాగా రాబిన్ ఊతప్ప ఒక సంచలన ప్రకటన చేశారు. అది కూడా ఐపీఎల్ లో ఇన్నాళ్లు ఒకే జట్టులో తనతో ఆడిన విరాట్ కొహ్లీపై చేయడంతో నెట్టిల్లు వేడెక్కిపోయింది. ఇంతకీ తనేమన్నాడంటే…
యువరాజ్ సింగ్ రిటైర్ కావడానికి ధోనీ కారణం కాదు, విరాట్ కొహ్లీయే అని చెప్పాడు. నిజానికి యువరాజ్ సింగ్ జట్టులో ఉన్నప్పుడే టీమ్ ఇండియా అద్భుతాలు సాధించిందని అన్నాడు. 2011 వన్డే వరల్డ్ కప్, 2007 టీ 20 వరల్డ్ కప్, 2022లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వీటన్నింటి విజయంలో యువరాజ్ దే కీలక పాత్రని అన్నాడు. అలాంటి యువరాజ్ క్యాన్సర్ ను జయించి 2017లో మళ్లీ జట్టులోకి వచ్చాడని తెలిపాడు.
అప్పుడు కెప్టెన్ గా విరాట్ ఉండేవాడు. తను ఫిట్ నెస్ పై చాలా శ్రద్ధ పెట్టేవాడు. జట్టులో అందరూ అలాగే ఉండాలని చెప్పి, కఠినమైన సాధనలు చేయించేవాడు. ఆ ఒత్తిడిని యువరాజ్ గుండె తట్టుకోలేకపోయింది. కనీసం తను క్యాన్సర్ పేషెంట్ అనే కనికరం కొహ్లీకి ఉండేది కాదు. తన విషయంలో అంత నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించాడని పేర్కొన్నాడు. ఇక విధిలేని పరిస్థితుల్లో తిరిగొచ్చిన ఏడాదే అంటే 2017లోనే యువరాజ్ రిటైర్మెంట్ ప్రకటించాడని అన్నాడు.
నిజానికి యువరాజ్ ఆల్ రౌండర్ అని అందరికి తెలిసిందే. బ్యాటర్లకు బ్యాటింగ్ బాధ్యత ఒక్కటే ఉంటుంది. బౌలర్లకు అంతే. కానీ ఆల్ రౌండర్లకు అటు బౌలింగు చేయాలి. అవసరమైనప్పుడు బ్యాటింగ్ చేయాలి. దీంతో యువరాజ్ పై ఒత్తిడి చాలా ఉండేదని చెప్పుకొచ్చాడు.
ఇకపోతే యువరాజ్ తన కెరీర్ లో 402 వన్డేలు ఆడి 11, 178 పరుగులు చేశాడు. వీటిలో 17 సెంచరీలు, 71 అర్థ సెంచరీలు ఉన్నాయి. ధోనీ తనకి అన్యాయం చేశాడని యువరాజ్ తండ్రితో సహా అంటుంటారు. అలా చేసేవాడైతే 17 ఏళ్ల కెరీర్ ఎలా కంటిన్యూ చేస్తాడు, 402 వన్డేలు ఎలా ఆడతాడని ధోనీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి రాబిన్ ఊతప్ప చెప్పిన మాటలను బట్టి యువరాజ్ కెరీర్ క్లోజ్ కావడంలో కొహ్లీ పాత్ర కూడా ఉందని అర్థమవుతోంది.