భూ నిర్వాసితుల పరిహారం పంపిణిలో జగిత్యాలలో 2019 లో పనిచేసిన రెవెన్యూ కీలక అధికారి, సిబ్బంది, ప్రైవేట్ టాక్స్ కన్సల్టెంట్ చేతివాటం ప్రదర్శించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని రైతులు రైల్వే లైన్ నిర్మాణం కోసం చేపట్టిన భూ సేకరణలో పలు ప్రాంతాల రైతులు సాగు భూములను కోల్పోయారు.
భూ నిర్వాసితులకు పరిహారంతో పాటు వడ్డీ కూడా చెల్లించాలని సుప్రీం కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. ఆదాయపరిమితికి మించి పరిహారం మంజూరు కాగా సదరు రైతులకు సంబంధించి ఆదాయపరిమితి నిబంధన ద్వారా లబ్ధిపొందెందుకు ఒక్క రైతుకు బదులు ఐదు, ఆరు రైతులను చూపించి పరిహారం విషయంలో పన్ను మినహాయింపు ద్వారా లబ్ధిపొందెందుకు అక్రమాలకు పాల్పడ్డారు.
కేంద్ర ఇన్కమ్ టాక్స్ అధికారులు మధ్యహ్నం 12 నుండి రాత్రి 9 గంటల వరకు RDO కార్యాలయంలో పైళ్లను పరిశీలించారు. సుమారు 300 మంది రైతులకు పరిహారం మంజూరు కాగా ఇందులో 100 మంది రైతులకు పరిహారం విషయంలో అక్రమాలు జరిగాయాని గుర్తించారు. సూమరు కోటి రూపాయలకు పైగా ఐటీ నిబంధనలకు విరుదంగా చేతులు మారినట్లు తెలుస్తుంది.
2019లో జరిగిన ఈ కుంభకోణంలో అప్పటి అర్డీఓ కార్యాలయంలో కీలక అధికారితో పాటు మరో ఇద్దరు ఉద్యోగులు ఓ ప్రైవేట్ టాక్స్ కాన్స్ల్టెంట్ కీలక పాత్ర పోషించినట్లు సమాచారాం.