ప్రకృతి వైపరీత్యం కారణంగా సింహాచలం దేవస్ధానానికి వరాహ లక్ష్మీ నరసింహ స్వామి నిజరూప దర్శనానికి విచ్చేసిన భక్తులు అనుకోని ప్రమాదం జరిగిన మృతి చెందడం అత్యంత దురదృష్టకరమని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి విచారం వ్యక్తం చేశారు. సింహాచలం ఘటనపై మంత్రి ఆనం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఉదయం రెండు గంటల ప్రాంతంలో స్వామివారి నిజరూప దర్శనం ప్రారంభమైన సమయంలోనే భారీ ఈదురు గాలులతో కుంభవృష్టిగా వర్షం కురవడం జరిగిందని ఆనం చెప్పారు. భారీ వర్షం కారణంగా కొండలపై నుంచి వర్షం నీరు చేరడంతో ప్రహరీ గోడ కింద ఉన్న మట్టి అంతా కొట్టుకుపోయి కొత్తగా కట్టిన ప్రభరీ గోడ కూలిపోయిందని దేవాదాయ శాఖ మంత్రి వివరించారు. కేంద్ర ప్రభుత్వం పర్యాటక రంగం నుంచి ప్రసాదం స్కీం కింద పలు ఆలయాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని అందులో భాగంగానే శ్రీశైలం, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాల్లో కూడా అభివృద్ధి పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఇదే ప్రసాదం స్కీమ్ కింద సింహాయలం దేవస్ధానంలో కూడా కొంత మేర ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని మంత్రి చెప్పారు. సింహాద్రి అప్పన్నకు జరిగే చందనోత్సవ వేడుకలను ప్రభుత్వ పండుగగా గుర్తించామని దాదాపు రెండు నెలల నుంచి దేవాదాయ శాఖ మంత్రిగా నేను, రెవిన్యూ శాఖ మంత్రి, హోం మంత్రి, అనువంశిక ధర్మకర్తగా అశోక్ గజపతిరాజు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ఏడుగురు భక్తులు మృతి చెందడం బాధాకరమన్నారు. ఘటనపై పూర్తి స్ధాయి విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.
- Advertisement with us -