30.6 C
Hyderabad
Thursday, June 4, 2026

Live Video

spot_img

ఐసిస్ కీలక నేత హతం.. తన వల్లే అంటున్న ట్రంప్

ఇరాక్‌లో ఉన్న ఐసిస్ గ్లోబల్ ఆపరేషన్స్ చీఫ్‌ అబ్దుల్లా మక్కీ ముస్లిహ్ అల్ రిఫాయ్.. అలియాస్ అబు ఖదీజాను అమెరికా మట్టుపెట్టింది. యూఎస్ సెంట్రల్ కమాండ్ నిర్వహించిన ఎయిర్‌స్ట్రైక్‌లో అబు ఖదీజా మృతి చెందాడు. దీనికి సంబంధించిన వీడియోను సెంట్రల్ కమాండ్ రిలీజ్ చేసింది. ఈ దాడి క్రెడిట్‌ను వెంటనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఖాతాలో వేసుకున్నారు.

నిజానికి ఈ దాడికి సంబంధించిన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఇచ్చింది ఇరాకీ ఏజెన్సీలు. ఈ సమాచారానికి అనుగుణంగానే అతడిని గుర్తించి మిసైల్‌తో స్ట్రైక్ చేసింది అమెరికన్ ఆర్మీ. అబు ఖదీజా మరో ఉగ్రవాదితో కలిసి కారులో వెళ్తుండగా మిసైల్‌తో అటాక్ చేశారు. ఈ స్ట్రైక్‌లో ఇద్దరు మృతి చెందారు. దీనికి సంబంధించి ట్రంప్ తన సొంత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. శాంతి స్థాపనలో మరో అడుగు పడిందన్నారు ఆయన.

నిజానికి ఖదీజాను మట్టుపెట్టేందుకు అమెరికన్ ఏజెన్సీలు చాలా నెలలుగా ప్రయత్నిస్తున్నాయి. గతంలో దాడులు కూడా చేశాయి. కానీ తృటిలో తప్పించుకున్నాడు. కానీ ఈసారి మాత్రం పక్కా సమాచారంతో దాడులు చేశాయి. అతడి DNAను కూడా సేకరించి.. మరణించినది అతడే ధ్రువీకరించుకున్నాయి. ఈ దాడి జరిగి రెండు రోజులు కాగా.. ఆలస్యంగా ఈ విషయాలను బయటికి రిలీజ్ చేసింది అమెరికా రక్షణశాఖ.

ఖదీజా మరణవార్తను ఇరాక్ ప్రధాని అబూ ఖదీజా కూడా కన్ఫామ్ చేశారు. అమెరికా చేసిన సాయాన్ని అభినందించారు ఆ దేశ ప్రధానమంత్రి మొహమ్మద్ షియా అల్ సుడానీ. అబు ఖదీజాను ఐసిస్‌లో అత్యంత పవర్‌ఫుల్‌ నేతగా చెబుతారు. ప్రపంచవ్యాప్తంగా ఐసిస్ నెట్‌వర్క్ అతని కంట్రోల్‌లోనే ఉంటుంది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com